యాపిల్ భారత్‌లో తన ఆదాయాన్ని పెంచుకుంటుంది. కేవలం రెండు అవుట్‌లెట్‌ల ద్వారా 2024 ఆర్థిక సంవత్సరానికిగాను ఏకంగా రూ.190-రూ.210 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవుట్‌లెట్‌ల్లో ఇదే రికార్డు ఆదాయమని కంపెనీ తెలిపింది.
ముంబై, దిల్లీలో రెండు యాపిల్ స్టోర్‌లు ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో యాపిల్ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ స్టోర్‌లు ప్రారంభించిన నాటినుంచి నెలవారీ సగటు అమ్మకాలు స్థిరంగా రూ.16 కోట్లు-రూ.17 కోట్లుగా నమోదవుతున్నాయని కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: కొత్త సౌండ్‌బాక్స్‌లు ప్రారంభించిన పేటీఎం.. ప్రత్యేకతలివే..
ముంబై స్టోర్ యాపిల్ బీకేసీ ఆదాయం దిల్లీ స్టోర్ యాపిల్ సాకెట్ కంటే కొంచెం అధికంగా నమోదైంది. త్వరలో భారత్‌లో మరో మూడు స్టోర్‌లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పుణె, బెంగళూరుతోపాటు దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయడానికి యాపిల్ చర్చలు జరుపుతోందని తెలిసింది. అయితే గతేడాది జూన్‌లో బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన స్టోర్‌లను విస్తరించే ఆలోచన లేదని కథనాలు వెలువడ్డాయి. కానీ 2024లో సమకూరిన ఆదాయాల నేపథ్యంలో భారత్‌లో మరిన్ని స్టోర్లను విస్తరించాలని అనుకుంటున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment