ఆటో బోల్తా : ముగ్గురికి గాయాలు
చౌడేపల్లె: మండలంలోని బాలసముద్రం సమీపంలో ఆటో బోల్తా పడిన సంఘటన గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. చుక్కావారిపల్లెకు చెందిన గంగులమ్మ, వసంతమ్మ, నీలమ్మతో మరికొందరు కలిసి చౌడేపల్లెలో ఆధార్ కార్డుల కోసం ఆధార్ సెంటర్‌ఽ వద్దకు బయలుదేరారు. మార్గమధ్యలో ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో గాయపడిన వారిని 108 సహాయంతో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సారా, మద్యం తరలిస్తున్న వారి అరెస్టు
చిత్తూరు అర్బన్: నిషేధిత సారా తీసుకెళ్తున్న ఇద్దరు నిందితులను ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ పవన్ తన సిబ్బందితో కలిసి గుడిపాల మండలం రఘునాథపురం కూడలి వద్ద తనిఖీలు చేస్తుండగా.. ఇదే మండలానికి చెందిన ఆర్.వెంకటేష్, శ్రీనివాసులు బైక్‌పై సారా తీసుకెళ్తుండగా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 17 లీటర్ల సారా ప్యాకెట్లను, స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో సిబ్బంది దేవప్రసాద్, రాజేష్, ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇంటి వద్దే మద్యం విక్రయించడానికి (బెల్టు దుకాణం) మద్యం తీసుకెళ్తున్న మల్లిక (30) అనే మహిళను చిత్తూరు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు–పొన్నై రోడ్డులో తాళంబేడుకు చెందిన మల్లిక అనే మహిళ ఓ సంచి తీసుకెళ్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. చిత్తూరులోని పలు మద్యం దుకాణాల్లో 30 మద్యం బాటిళ్లను తీసుకుని ఇంటి వద్ద విక్రయించడానికి తీసుకెళ్తున్నట్లు గుర్తించి నిందితురాలిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీహరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment