రైతులకు టోకరా
కార్వేటినగరం: రైతులను మోసం చేసిన నిందితులను కార్వేటినగరం సీఐ హనుమంతప్ప అరెస్టు చేశారు. వివరాలు.. గుండ్రాజుఇండ్లు గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తి ట్రాక్టర్లు ఇప్పిస్తామని.. ట్రాక్టర్లు ఉంటే వాటిని బాడుగకు పెట్టుకుని, డబ్బులు ఇస్తామని చెప్పడం.. అలాగే ట్రాక్టర్ల నెలవారీ ఈఎంఐలను కూడా తానే కడతానని చెప్పి రైతుల నుంచి ట్రాక్టర్లను తీసుకుని మోసం చేశాడు. అలాగే ఇదే మండలానికి చెందిన ఏకాంబరం అలియాస్‌ఽ చిన్న, శంకర్‌కు కూడా ఇతను పలువురు రైతుల నుంచి ట్రాక్టర్లు ఇప్పించాడు. వీరు మురళితో కలిసి ఈఎంఐలు చెల్లించకుండా, రైతులకు ట్రాక్టర్లు, బాడుగలు ఇవ్వకుండా మోసం చేస్తూ వచ్చారు. దీనిపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ హనుమంతప్ప కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. శనివారం నిందితులు మురళి, ఏకాంబరం, శంకర్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి సుమారు రూ.20 లక్షలు విలువ జేసే నాలుగు ట్రాక్టర్లను రికవరీ చేసి యజమానులకు అప్పగించారు. ఎవరైనా ఈఎంఐలు కడతామని, బాడుగలు ఇస్తామని చెప్పి మోసం చేసేందుకు ఎవరైనా యత్నిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రాజ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. కేసును ఛేదించడంలో ప్రత్యేక చొరవ చూపిన కానిస్టేబుల్ రాజశేఖర్, హోంగార్డు యువరాజును ఆయన అభినందించారు.
రూ.20 లక్షలు విలువజేసే ట్రాక్టర్ల రికవరీ
ముగ్గురు నిందితుల అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment