దివ్యాంగుని అవస్థ
ఏక సభ్య కమిషన్‌కు తన మొర విన్నవించుకోవడానికి విచ్చేసిన దివ్యాంగుడు లిఫ్టు పనిచేయక అవస్థ పడ్డాడు.
కుటుంబ సభ్యులతో కార్తీక్
●
రెండు రోజుల క్రితం
ఫోన్ చేసి మాట్లాడాడు
నా కుమారుడు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఫోన్ చేసి మాతో మాట్లాడాడు. క్షేమంగా ఉన్నానని తెలిపాడు. నాలుగు నెలల్లో ఇంటికి సెలవుపై వస్తానని చెప్పాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఫోన్ కాల్ వచ్చింది. రాంగ్ కాల్‌గా భావించి కట్ చేశాము. మళ్లీ కాల్ వచ్చింది. మేము ఆర్మీ అధికారులు మాట్లాడుతున్నాము. కశ్మీర్‌లో జరిగిన కాల్పుల్లో మీ అబ్బాయి గాయపడ్డాడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. సాయంత్రం మళ్లీ ఫోన్ చేసి మరణించాడని చెప్పడంతో కుప్పకూలిపోయాము. కూమారుని వీరమరణం వార్త వింటాననుకోలేదు.
– వీరజవాన్ తండ్రి వరదరాజులు మందడి
పెళ్లి సంబంధం చూశాం
ఆర్మీలో ఉన్న తమ్ముడికి పెళ్లి చేసేందుకు సంబంధాలు కూడా చూశాం. నా భార్య చెల్లెని ఇచ్చి వివా హం చేయాలనుకున్నాం. నవంబర్, డిసెంబర్ నెలల్లో పెళ్లి చేయాలనుకున్నాం. ఇంతలోనే తమ్ముడు కార్తీక్ ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం చెందాడు. తట్టుకోలేకపోతున్నా. ఆర్మీ వాళ్ల కష్టాలు తెలిసిన నాకు తమ్ముడు ఆర్మీలో చేరడం ఏ మాత్రం ఇష్టం లేదు. ఉన్నతవిద్య చదువుకుని వేరే ఉద్యోగంలో స్థిరపడాలనుకున్నా. నేను కూడా ఆర్మీ సెలక్షన్‌కు వెళ్లి తిరిగి వచ్చేశాను.
– వీరజవాన్ అన్న రాజేష్
– 8లో
Comments
Please login to add a commentAdd a comment