కూటమి సంక్షోభ పాలన
ఎన్నికల సమయంలో కూటమి నాయకులు అనేక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలపై విపరీతంగా ప్రచారం చేశారు. అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకూ వాటిని పూర్తిస్తాయిలో నెరవేర్చలేకపోయారు. వారిచ్చిన హామీ ప్రకారం జిల్లా ప్రజలకు అందాల్సిన లబ్ధి వివరాలు ఇవీ.
1. తల్లికి వందనం కింద జిల్లాలో 1,68,000 మందికి సుమారు రూ.252 కోట్లు వరకు అందించాల్సి ఉంది.
2. నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించడం లేదా నిరుద్యోగ భృతి కోసం 4.80 లక్షల మందికి ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు వీరికి రూ.864 కోట్లు ఇవ్వాలి.
3. ఉచిత గ్యాస్ సిలిండర్ల అమలు నామ్‌కే వాస్తే అన్నట్టుగా మారింది. జిల్లాలో 3.90 లక్షల మందికి ఈ ఏడాది మూడుసిలిండర్లు రెండు ఎత్తి వేశారు. ఒకదానికి మాత్రమే చాలా తక్కువ మందికి అందించారు.
4. మహిళలకు నెలకు ఇస్తానన్న రూ.1,500 కోసం జిల్లాలో 6.03 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. వీరికి ఏడాదికి రూ.1,094.52 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
5. ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇప్పటికీ మొదలు కాలేదు. ఉచిత ప్రయాణం కోసం జిల్లాలో 9.10 లక్షల మంది ఎదురు తెన్నులు చూస్తున్నారు.
6. రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. 1.45 లక్షల మంది ఎదురు తెన్నులు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment