నిరసనల హోరు
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పలు వర్గాల నిరసనల ప్రదర్శనతో జిల్లా కలెక్టరేట్, జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు హోరెత్తుతున్నాయి.
సెప్టెంబరు 30
తీర ప్రాంత మండలాల్లో ముంపు సమస్య పరిష్కరించాలని కోనసీమ రైతు పరిరక్షణ సమితి సభ్యులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పర్ర భూములు ఆక్రమణలు, మురుగునీటి కాలువల్లో పూడిక తొలగించాలని డిమాండ్ చేశారు.
అక్టోబరు 2
సీఐటీయూ ఆధ్వర్యంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పారిశ్రామిక కార్మికులు, నాన్ పర్మినెంట్ ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలని, బకాయి వేతనాలు చెల్లించాలని రాష్ట్ర సమగ్ర శిక్ష జేఏసీ పిలుపు మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.
అక్టోబరు 3
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయకూడదని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, ఏఐటీయూసీ, ఎస్‌ఎఫ్‌ఐ, వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా, కౌలు రైతు సంఘాల ఆధ్వరంలో దీక్ష చేశారు.
నవంబరు 10
రాజోలు బీసీ బాలుర వసతి గృహం వద్ద ‘‘వార్డెన్ రావాలి... ఆకలి తీ ర్చాలి’’ అంటూ విద్యార్థుల ఆందోళనకు దిగారు. 104 ఉద్యోగుల న్యా యమైన డిమాండ్లను పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు.
నవంబరు 16
మినీ అంగన్‌వాడీ కార్యకర్తలను మెయిన్ కార్యకర్తలుగా గుర్తించాలని కోరుతూ ధర్నాకు దిగారు.
నవంబరు 18
కలెక్టరేట్ వద్ద ఆశావర్కర్లు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఽనిరసన ప్రదర్శన చేశారు. ప్రభుత్వ పాఠశాలు, కళాశాలల్లో పారిశుధ్య కార్మికులు, వాచ్‌మెన్‌లు సైతం ఆందోళన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment