బాలాజీ దర్శనానికి పోటెత్తిన భక్తులు
మామిడికుదురు: అప్పనపల్లిలో కొలువైన బాల బాలాజీ స్వామి దర్శనానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారు జామున తొలి హారతి, మేలు కొలుపు సేవలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసంలో భాగంగా గోదావరి నుంచి జలాలు తీసుకు వచ్చి గోదాదేవితో పాటు బాల బాలాజీ స్వామికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. స్వామి వారి సన్నిధిలో నిత్యం నిర్వహించే లక్ష్మీనారాయణ హోమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. గోశాలను సందర్శించి గోవులకు పూజలు చేశారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.2.12,910 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు. నిత్యాన్నదానం ట్రస్టుకు భక్తులు 65,750 విరాళాలుగా అందించారన్నారు. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.39,780 ఆదాయం వచ్చిందన్నారు. 3,518 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని, 2,429 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment