నర్సింగ్ స్కూల్‌లో దిద్దుబాటు చర్యలు
కాకినాడ రూరల్: అన్ని రంగాల కంటే వైద్య రంగం ప్రధానమైంది. వైద్యులు, సిబ్బందిని భగవంతుడితో సమానంగా రోగులు భావిస్తుంటారు. ముఖ్యంగా నర్సుల సేవలు వెలకట్టలేనివి. అటువంటి నర్సింగ్ వృత్తిని ఎంచుకుని వస్తున్న వారికి ఇబ్బంది ఎదురైంది. తమ నుంచి నర్సింగ్ స్కూల్ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తూనే నాణ్యత లేని ఆహారంతో పాటు, టాయిలెట్లు, ఇతర కనీస వసతులు కల్పించక పోవడంతో తమ ఆక్రందనను జిల్లా కలెక్టర్‌కు వారు చేరవేశారు. తీవ్రంగా స్పందించిన కలెక్టరు షణ్మోహన్ వెంటనే రంగంలోకి అధికారుల బృందాన్ని దింపి ఇంద్రపాలెంలోని లక్ష్మీ గాయత్రి నర్సింగ్ స్కూల్‌పై తనిఖీలు చేయించారు. ఆ స్కూల్‌లో డీఎంహెచ్‌ఓ, ఐసీడీఎస్ పీడీ, రెవెన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా బుధవారం రాత్రి పరిశీలించారు. అక్కడ విద్యార్థినులకు సరైన అల్పాహారం, భోజనం పెట్టడం లేదని తెలుసుకున్నారు. అర్హత కలిగిన బోధనా సిబ్బంది లేరని కనీసం విద్యార్థినులకు సరిపడా టాయిలెట్లు, బాత్ రూమ్‌లు లేవని గుర్తించారు. యాజమాన్యం నిర్లక్ష్యాన్ని అధికారులు వద్ద విద్యార్థినులు తేటతెల్లం చేయడంతో కలెక్టరు ఆ సమస్యలపై తీవ్రంగా స్పందించారు. కేసు నమోదుకు ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
ఫీజుల కోసం వేధింపులు, సరైన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో తీవ్ర అసంపూర్తితో ఉన్న ఐదుగురు విద్యార్థినులు లక్ష్మీ గాయత్రి నర్సింగ్ స్కూల్ యాజయాన్యంపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆ స్కూల్ నిర్వాహకుడు సత్యనారాయణ మూర్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని ఇంద్రపాలెం ఎస్సై వీరబాబు తెలిపారు. ఆ నర్సింగ్ స్కూల్ విద్యార్థినులకు కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ మల్లిబాబు గురువారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. విద్యార్థినులకు ఆహారం, సంరక్షణ, సరైన బోధన ఏర్పాటు చేయాలని, లేకుంటే గుర్తింపు రద్దుకు వెనకాడమని ఆర్డీఓ హెచ్చరించారు.
ఫ విద్యార్థినులకు అల్పాహారం,
భోజనం ఏర్పాటు
ఫ మెరుగైన సౌకర్యాలు
కల్పించాలని అధికారుల సూచన
Comments
Please login to add a commentAdd a comment