జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సంక్రాంతి పండగ సందర్భంగా ఎవ్వరూ కోడిపందాలు, గుండాట, ఎటువంటి జూద క్రీడలూ నిర్వహించరాదని, ఆవిధంగా చేస్తే కఠిన చర్యలు తప్పనని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో నిషేధిత ఆటలను అడ్డుకునేందుకు ఆడేందుకు అవకాశం ఉన్న ప్రదేశాల్లో పోలీసు ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి కానిస్టేబుళ్ల వరకూ పర్యటించి, ప్రత్యేక నిఘా పెట్టామని వివరించారు. గతంలో నిర్వహించినవారు, ఆడిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. కోడిపందాలు, ఇతర నిషేధిత ఆటలపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే 112 నంబర్‌కు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment