జాతీయ వాలీబాల్ పోటీలకు ఎంపిక
సీతానగరం: వాలీబాల్ ఫెడ రేషన్ ఆఫ్ ఇండియా (అడ్‌హాక్ కమిటీ) ఆధ్వర్యాన రాజస్థాన్‌లోని జైపూర్‌లో మంగళవారం నుంచి నిర్వహించే 69వ జాతీయ సీనియర్ వాలీబాల్ పోటీల్లో పా ల్గొనే రాష్ట్ర పురుషుల జట్టుకు ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. సీతానగరానికి చెందిన వాలీబాల్ కోచ్, వాలీబాల్ అసోసియేషన్ సభ్యుడు కోండ్రపు వీర వెంకట సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. కోరుకొండ మండలం గాడాలకు చెందిన గోపిరెడ్డి వెంకట శివ, పెదపూడికి చెందిన ఎస్.సుధీర్ కుమార్ ఈ పోటీలకు ఎంపికయ్యారన్నా రు. 2020 తరువాత రాష్ట్రంలోను, దేశంలోను వాలీబాల్ అసోసియేషన్లకు గుర్తింపు లేదని, ఇప్పుడు అడ్‌హాక్ కమిటీ ఆధ్వర్యాన అధికారికంగా జరుగుతున్న ఈ పోటీల్లో ఇచ్చే సర్టిఫికెట్లకు గుర్తింపు ఉంటుందని వివరించారు. తద్వారా క్రీడాకారులు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందడానికి అవకాశాలుంటాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment