చిన్నారులకూ ఆధార్ నమోదు
ఫ నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్
ఫ ఐదు రోజుల పాటు నిర్వహణ
ఫ కలెక్టర్ ప్రశాంతి వెల్లడి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో ఆరేళ్ల లోపు పిల్లల ఆధార్ నమోదుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం సోమ వారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకూ జరుగుతుందని, ఈ సందర్భంగా ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తామని వివరించారు. దీనికోసం ఎంపీడీఓలు, క్షేత్ర స్థాయి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తొలిదశలో 84 బృందాలకు ఆయా మునిసిపల్, మండల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు, సమీప సచివాలయాల సి బ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆధార్ నమో దు బృందాలు ఏ రోజు ఎక్కడ ఉంటాయో మండల కార్యాలయాలు, సచివాలయాల్లోని నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలన్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచి వాలయాల వారీగా అంగన్‌వాడీల వివరాలతో రూట్ మ్యాప్ ఇచ్చామని తెలిపారు. వివిధ కారణాలతో ఆధార్ నంబర్ లేని ఆరేళ్ల లోపు పిల్లలు సుమారు 17 వేల మంది ఉండే అవకాశం ఉందనే అంచనాకు వచ్చామన్నారు. తమ చిన్నారులకు ఆధార్ నమోదు చేయించుకోవాలనుకునే వారు పేరుతో కూడిన చిన్నారుల జన్మ ధ్రువీకరణ పత్రం, తండ్రి ఆధార్ కార్డు, ఫోన్ నంబర్‌తో ఆయా సిబ్బందిని కలవాలని సూచించారు. ఆధార్ నమో దు కార్యక్రమంలో వార్డ్ ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, డిజిటల్ అసిస్టెంట్లు ఆయా సచివాలయాల పరిధిలో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆధార్ శిబిరాలు జరుగుతున్న సమయంలో వారికి ఇతరత్రా ఎటువంటి పనులు, సర్వేలు అప్పగించరాదని స్పష్టం చేశారు. ప్రత్యేక ఆధార్ నమోదు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఎటువంటి సెలవులూ మంజూరు చేయరాదని క్షేత్ర స్థాయి అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment