ఇంగ్లీష్ మీడియంపై కుట్ర
ఇంగ్లీష్ మీడియం విద్య అందరికీ అందుబాటులో తేవాలన్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి లక్ష్యాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. పేదలు చదివే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియంకు మంగళం పాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై జరిగిన దాడి అనేక అనుమానాలకు ఊతమిస్తోంది. రాష్ట్రంలో మొదలైన విద్యావిప్లవాన్ని మళ్లీ వెనక్కి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మేధావులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో..
గురువారం శ్రీ 2 శ్రీ జనవరి శ్రీ 2025
మేధావులు మారాలి
కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో టోఫెల్, సీబీఎస్‌ఈ స్కూళ్లను రద్దు చేసింది. సుమారు 2 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుగలకు దూరమయ్యారు. తెలుగు మీడియం కోరుకునే మేధావులు తమ పిల్లలను, మనవళ్లను ఏ మీడియంలో చదివిస్తున్నారో గుర్తు చేసుకోవాలి.
– ఎస్.వి.జాకబ్ బాబు,
స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి
తిరోగమనంలో విద్యా వ్యవస్థ
కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ తిరోగమనంలో ఉంది. పేద, మధ్య తరగతి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించాలనే సంకల్పంతో గత ప్రభుత్వం కృషి చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియంను రద్దు చేయాలనుకోవడం సమంజసం కాదు.
– పెన్మెత్స రామరాజు,
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, తణుకు
ఆంగ్ల విద్యకు మద్దతు పలకాలి
ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీషు బోధనతో ఉన్నత చదువులు పేదవాడికి మరింత దగ్గరవుతాయి. అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆంగ్ల విద్యా బోధనపై సమీక్ష చేయాలి. మేధావులు మద్దతు తెలపాలి.
– కోన జోసెఫ్, ఏలూరుపాడు
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించిన జీఓ నెం.85ను రద్దు చేయాలని కొందరు పెద్దలు కోరడం సమంజసం కాదు. ఇది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడినట్లే. పిల్లల్ని ఏ మీడియంలో చదివించుకోవాలనే హక్కు తల్లిదండ్రులకు ఉంటుంది.
– కాండ్రేకుల శ్రీను, నరసన్నచెరువుపాలెం
పీఆర్టీయూ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయ సంఘం పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 సంవత్సర డైరీని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తే ఫలితాలు వాటంతటవే వస్తాయన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు అధికారులకు, ఉపాధ్యాయులకు మధ్య వారధిలా పని చేయాలని, ఎక్కడ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాను ప్రథమస్థానంలో నిలపడానికి ఉపాధ్యాయులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి కేవీవీ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ అభ్యాసకులకు వచ్చే మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షల నిమిత్తం ఫీజులు చెల్లించడానికి గడువు పెంచి నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతిలో ఒక్కో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్‌లో థియరీ సబ్జెక్టులు ఒక్కోదానికి రూ.150 చెల్లించాలని తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఒక్కో సబ్జెక్టుకు రూ.100 చెల్లించాలని సూచించారు. ఈ నెల 6 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజులు చెల్లించవచ్చని, రూ.25 అపరాధ రుసుంతో ఈ నెల 7, 8 తేదీల్లో చెల్లించవచ్చనన్నారు. రూ.50 అపరాధ రుసుంతో ఈ నెల 9న, తత్కాల్ విధానంలో ఇంటర్మీడియట్‌కు రూ.వెయ్యి, పదో తరగతికి రూ.500 అపరాధ రుసుంతో ఈ నెల 10న చెల్లించవచ్చన్నారు.
విద్యుత్ సంస్థలో జేఏఓలకు పదోన్నతులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో జూనియర్ అకౌంట్స్ అధికారులుగా పనిచేస్తున్న పలువురికి అసిస్టెంట్ అకౌంట్స్ అధికారులుగా పదోన్నతులు కల్పిస్తూ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి ఆదేశాలు జారీ చేశారు. ఏలూరులో జేఏఓగా పని చేస్తున్న హరిప్రియను భీమవరానికి పదోన్నతిపై బదిలీ చేశారు. విశాఖపట్నంలో ఏజేఓగా పని చేస్తున్న దుర్గా భాస్కరిని తంగెళ్ళమూడికి బదిలీ చేశారు. విజయవాడలో డిప్యుటేషన్‌పై పని చేస్తున్న రంపచోడవరం జేఏఓ శ్రీలక్ష్మిని ఏలూరు ఏఏఓగా బదిలీ చేశారు.
సాక్షి, భీమవరం : విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో గత నెల 28, 29 తేదీల్లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగాయి. పలువురు ప్రముఖులు మాట్లాడుతూ మాతృభాషను కాపాడేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఎత్తివేయాలని, ఇంగ్లీష్ మీడియం బోధించేందుకు గత ప్రభుత్వం తెచ్చిన జీవో 85ను రద్దుచేయాలని కోరడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పెద్దలు తమ పిల్లలు, మనువలను ఏ తెలుగు మీడియం పాఠశాలల్లో చదివించారని చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ వర్గాలు వారి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లీషు మీడియంతో పాటు తెలుగు మీడియంను కొనసాగించేలా పాలకులు ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారు.
పేద విద్యార్థులు పోటీపడేలా..
బిడ్డల మంచి భవిష్యత్తుకు వారిచ్చే నిజమైన ఆస్తి విద్యేనని ప్రతి తల్లీ, తండ్రి భావిస్తారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తమ పిల్లలు ఎక్కడకు వెళ్లి బతకాలన్నా, అవకాశాలను అందుకోవాలన్నా అందుకు ఇంగ్లీష్ తప్పనిసరనేది జగమెరిగిన సత్యం. అందుకోసం తమకు ఫీజులు చెల్లించే స్తోమత లేకున్నా అప్పులు చేసైనా ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తుంటారు. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా పేద వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను ఇవ్వడమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేశారు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం పాఠశాలల్లోనే ఇంగ్లీష్ మీడియం విద్యకు శ్రీకారం చుట్టారు.
జగన్ సర్కారులో విద్యా విప్లవం
జగన్ సర్కారులో ప్రభుత్వ బడుల్లో విద్యా విప్లవం వచ్చింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశీయులు సైతం ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం, తరగతి గదులను డిజిటలైజేషన్ చేయడం వంటి మార్పులను స్వాగతించారు. కూటమి ప్రభుత్వం నీరుగార్చేలా చేస్తుంది.
– కాగిత సత్యవాణి, నర్సాపురం
ఆంగ్ల భాషకు ప్రాధాన్యమివ్వాలి
ఇటీవల జరిగిన తెలుగు మహాసభల్లో తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరడం సబబే. ఈ వంకతో ఆంగ్ల భాషను తొలగించాలనడం సరికాదు. తెలుగుకు ప్రాధాన్యతనిస్తూనే ఆంగ్ల భాషను కూడా కొనసాగించాలి. నేడు ఏ ఉద్యోగంలోకి వెళ్లాలన్నా ఆంగ్లభాష ఉండాల్సివస్తుంది.
– బాకూరి సత్యనిరంజన్‌రావు, పాలకొల్లు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2710 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 2.26 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు .. వారు ప్రపంచంతో పోటీ పడేలా ఇంగ్లీష్ విద్యను అందించాలని 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను ప్రారంభించారు. కార్పొరేట్‌కు కొమ్ముకాస్తూ గత పాలకులు విద్యను నిర్లక్ష్యం చేయడంతో అధోగతిపాలైన ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టారు. పాఠశాలలకు నాడు–నేడులో రూ.కోట్లాది రూపాయలు వెచ్చించి కొత్త రూపు తెచ్చారు. ఏటా ఒక్కో తరగతిని పెంచుకుంటూ 2024–25 నాటికి 10వ తరగతిని ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేలా కార్యచరణ అమలుచేశారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తూ ఏటా 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్‌తో రూ.30 వేలు విలువచేసే ట్యాబ్‌లు అందిస్తూ వచ్చారు. తరగతి గదుల్లో డిజిటల్ విద్యను అందించేందుకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐపీపీ), స్మార్ట్ టీవీలు అందజేశారు. దేశంలోనే తొలిసారిగా బైలింగ్వుల్ (మిర్రర్ ఇమేజ్), ప్రైమరీ విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ, హైస్కూల్ విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలను అందించారు. వాటి ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లోని ఎంతోమంది విద్యార్థులు 10వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో 590కు పైగా మార్కులతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు సవాల్ విసిరారు. నాడు దివంగత వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంట్ తెచ్చి పేదల పిల్లల ఉన్నతికి బాటలు వేస్తే.. తండ్రిని మించిన తనయుడిగా ఎన్నో సంస్కరణలతో పేదల బతుకుల్లో విద్యాకాంతులు నింపిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్ దక్కించుకున్నారు.
విభిన్న ప్రతిభావంతులకు పెట్రోల్ రాయితీ
ఏలూరు (టూటౌన్): విభిన్న ప్రతిభావంతులు సొంత వ్యాపారం లేదా ఏదేని గుర్తింపు కలిగిన ప్రైవేటు సంస్థల్లో పని చేస్తూ మూడు చక్రాల బైక్ ఉంటే పెట్రోలు రాయితీకి దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫాంతో పాటు సదరం ధ్రువీకరణ పత్రం, పెట్రోల్ బిల్లులు, బీపీఎల్ రేషన్ కార్డు, డైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ, ఇతర వివరాలు తమ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇతర వివరాలకు 08812–234146 నెంబరులో సంప్రదించాలన్నారు.
న్యూస్‌రీల్
పేదల పిల్లలు తెలుగులోనే చదవాలా..?
ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా ఇంగ్లీష్ మీడియంపై దాడి
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం జీఓ రద్దుకు వినతి
వ్యతిరేకిస్తున్న వివిధ వర్గాలు
Comments
Please login to add a commentAdd a comment