కంకర పరిచారు.. తారు మరిచారు
ఎస్‌బీఐ బజారు బ్రాంచ్ వద్ద..
ఏలూరు నగరంలో ‘గుంతలు లేని రహదారులు’ పేరిట చేపట్టిన పనుల్లో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోంది. పాడైపోయిన రోడ్డు గుంతల్లో కంకర వేసి.. తారు వేయకుండా వదిలేశారు. దీంతో కంకర రోడ్డు మీద వాహనాలు అదుపు తప్పి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. సంక్రాంతిలోపు గుంతలు లేని రహదారులు ఉండాల నే ఆదేశాలతో స్థానిక నాయకులు హడావుడిగా శంకుస్థాపనలు చేశారు. అయితే పనులు ఇలా అసంపూర్తిగా వదిలేయడంపై ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఏలూరులోని పలు ప్రాంతాల్లో గుంతలను కంకరతో పూడ్చి వదిలేసిన దృశ్యాలివి.
– సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment