ఆలయాలను సందర్శించిన రాష్ట్ర డీజీపీ
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరంలోని మా వుళ్లమ్మ, పంచారామక్షేత్రం ఉమాసోమేశ్వర జ నార్దన స్వామి ఆలయాలను రాష్ట్ర డీజీపీ ద్వా రకా తిరుమలరావు ఆదివారం కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. డీజీపీ ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. మావుళ్లమ్మ ఆలయంలో ఆలయ స హాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, పంచారామ క్షేత్రంలో ఈఓ డి.కృష్ణంరాజు ఆయన కు దేవతామూర్తుల చిత్రపటాలు అందజేశారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, అడిషనల్ ఎస్పీ భీమారావు తదితరులు డీజీపీ వెంట ఉన్నారు.
టీచర్ల జీతాల చెల్లింపులో వివక్ష తగదు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జనవరి నెల ఆరంభమై ఐదు రోజులు గడిచినా ఉపాధ్యాయులకు జీతా లు జమచేయకపోవడం దారుణమని ఏపీటీఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీటీఎఫ్ ఏలూరు జోన్ సమావేశాన్ని జోనల్ కార్యదర్శి కె.కొండయ్య అధ్యక్షతన ఆదివారం తంగెళ్లమూడిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఉపాధ్యాయులకు పీఎఫ్, ఏపీజీ ఎల్‌ఐ రుణాల మంజూరులో ప్రభుత్వం తా త్సారం చేస్తోందని విమర్శించారు. కూటమి ప్ర భుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వెంటనే ఐఆర్ ప్రకటించి సకాలంలో జీతాలు, లో న్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్య క్షుడు డీకేఎస్‌ఎస్ ప్రకాష్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment