ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ఉందనే భరోసాతో ఉన్నాం. ఏదైనా అనారోగ్యం వస్తే వెళ్లి చూపించుకుంటున్నాం. అలాంటి ఉచిత సేవలు నిలిపివేస్తారంటే ఆందోళనగా ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చూడాలి. జగన్ ప్రభుత్వంలో ఇంటింటికీ వచ్చి వైద్య సేవలందించడంతో పాటు నిర్విరామంగా ఆరోగ్యశ్రీ సేవలు అందాయి. –బి.కమలావతి, కొండేపూడి
సక్రమంగా అమలుచేయాలి
ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు నిలిచిపోతే పేదలు ఎక్కడకు వెళతారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టులు, వైద్య సౌకర్యాల కొరత ఉంది. పేదల ప్రాణాలతో చెలగాటం వద్దు. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కాకుండా చూడాలి. – వీరవల్లి శ్రీనివాస్, తోకలపూడి
●
Comments
Please login to add a commentAdd a comment