11న డీటీఎఫ్ ధర్నా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ఉపాధ్యా య, విద్యారంగ సమస్యలను పరిష్కరించా లని డిమాండ్ చేస్తూ ఈనెల 11న విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టనున్నట్టు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర అధ్యకుడు కె.నరహరి తెలిపారు. ఆదివారం ఏలూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జీఓ 117ను పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా మోడల్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు విఫల ప్రయోగమన్నారు. విద్యాహ క్కు చట్టం ప్రకారం ఆవాస ప్రాంతంలోని పా ఠశాలలన్నింటినీ కలపడం సరికాదన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలు కొనసాగించాలని, వాటిని స్కూల్ అసిస్టెంట్లతోనే నడపాలని, ప్లస్ టూ కళాశాలలు కొనసాగించాలని కోరా రు. ఉపాధ్యాయులకు పాత పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించాలని, నూతన పీఆర్సీతో పాటు 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏలో పీఈటీ పోస్టులు అప్ గ్రేడ్ చేయాలని, గిరిజన ప్రాంతాల్లో రద్దయిన జీఓ నం.3లోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూ డిన కరపత్రాలను ఆవిష్కరించారు. రాష్ట్ర కా ర్యదర్శి కె.సురేష్‌కుమార్, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ కె.త్రినాథరావు, జిల్లా అధ్యక్షుడు కె.కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment