ప్రజల్లో పరివర్తన రావాలి
హెల్మెట్ ధారణ విషయంలో వాహనచోదకుల్లో పరివర్తన తీసుకురావాలని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్‌కుమార్ అన్నారు. IIలో u
‘సాక్షి’ స్పెల్‌బీలో
సరోజారెడ్డి అద్వితీయం
జంగారెడ్డిగూడెం: ‘సాక్షి’ మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న స్పెల్ బీ, మాథ్స్ బీ ఫైనల్స్ పోటీల్లో జంగారెడ్డిగూడెంలోని ప్రతిభ ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు విజయఢంకా మోగించినట్టు ప్రిన్సిపాల్ కాసర లక్ష్మీ సరోజారెడ్డి, అకడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి తెలిపారు. తమ విద్యార్థులు తాడేపల్లిగూడెంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్, రాజమండ్రిలో జరిగిన సెమీ ఫైనల్స్‌లో సత్తాచాటి హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి పోటీలకు చేరుకున్నారన్నారు. రాష్ట్రస్థాయి స్పెల్‌బీ ఫైనల్స్‌లో కాసరా ప్రతిభా సరోజారెడ్డి (7వ తరగతి) ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం, రూ.5 వేల నగదు బహుమతి పొందిందన్నారు. అలాగే స్పెల్‌బీలో గీశ్వంత్ నాయుడు, లోహిత్ శ్రీ కార్తిక్, పి. దుర్గాశ్రీ ప్రతిభ కనబర్చారన్నారు. మ్యాథ్స్ బీ ఫైనల్‌లో కె.రోషన్, పి.దుర్గాశ్రీ పాల్గొన్నారని, దుర్గాశ్రీ నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. సరోజారెడ్డిని శనివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment