ఏలూరు టౌన్: ఏలూరు నియోజకవర్గంలో తాను సబ్ కాంట్రాక్టర్‌గా పనులు చేయగా తనకు రావాల్సిన సొమ్ము ఇవ్వకుండా మోసం చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఎన్‌టీఆర్ జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన వేమూరి రామకృష్ణ పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేశాడు. ఈ వివరాలు బుధవారం స్థానిక విలేకరులకు అందాయి. బాధితుడు ఫిర్యాదు మేరకు సబ్ కాంట్రాక్టర్‌గా అనేక చోట్ల కాంట్రాక్ట్ పనులు చేసే రామకృష్ణ ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం పరిధిలోని ఇందిరమ్మ కాలనీ, వైఎస్సార్ కాలనీల్లో సీసీ రోడ్లు పనులు చేశాడు. ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని సోదరుడు ఆళ్ల సురేష్ (బాబు) తనకు ఏలూరులో పలు కాంట్రాక్ట్ పనులు చేయాలని చెప్పగా బిల్లులు రావని చెప్పానని, పెట్టుబడి నేనే చూసుకుంటా అని సురేష్ చెప్పారని తెలిపారు. తొలుత తన ఖాతాల్లో వేర్వేరు వ్యక్తుల నుంచి రూ.70 లక్షలు జమ చేయగా పనులు ప్రారంభించి పూర్తి చేశామని తెలిపారు. అదే విధంగా పలు దఫాలుగా అభివృద్ధి పనులు సుమారు రూ.3 కోట్ల వరకూ ఖర్చు చేసి పూర్తి చేశామని తెలిపారు. తనకు సుమారు రూ.1.27కోట్ల 45వేల 423ల మేర సొమ్ములు చెల్లించారని, ఇంకా రూ.2.45కోట్ల మేర సొమ్ములు ఇవ్వాల్సి ఉందని బాధితుడు రామకృష్ణ తెలిపాడు. ఈ నేపథ్యంలో తన ఫిర్యాదును సీఐడీతో విచారించి తనకు న్యాయం చేయాలని రామకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment