బాపట్ల అర్బన్: పదో తరగతి పరీక్షల విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ముగ్గురు ఇన్విజిలేటర్లను సస్పండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చందోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ బి.నాగాంజనేయులు, ఓపెన్ స్కూల్ పరీక్షల ప్రభుత్వ డెఫ్ అండ్‌డెమ్ రెసిడెన్షియల్ స్కూల్ వెదుళ్లపల్లిలోని పరీక్ష కేంద్రంలో ఇద్దరు ఇన్విజిలేటర్లు బి.వెంకటేశ్వర్లు, కె.ప్రసాద్‌లను సస్పెండ్ వేటు వేసినట్లు చెప్పారు. వీరితో చందోలు కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఆర్.వి.సుబ్బారావు, డీఓ కె.శ్రీనివాసరావు, వెదుళ్లపల్లి సీఎస్ కె.అనిల్‌కుమార్, డీఓ విజయరాజులకు చార్జి మెమోలు జారీ చేసినట్లు డీఈఓ వెల్లడించారు.
నిమ్మకాయల ధరలు
తెనాలిటౌన్: తెనాలి మార్కెట్‌యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,000, గరిష్ట ధర రూ.5,300, మోడల్ ధర రూ.4,000 వరకు పలికింది.
సాగర్ నీటిమట్టం 528 అడుగులు
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 528.40 అడుగుల వద్ద ఉంది. ఇది 165.0408 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎడమకాలువకు 4,287, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 3,920, ఎస్‌ఎల్‌బీసీకి 1,350, వరద కాలువకి 320 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఔట్‌ఫ్లోగా 9,875 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 7,641 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. నీటిమట్టం 805.80 అడుగుల వద్ద ఉంది. ఇది 31.9380 టీఎంసీలకు సమానం.
పశ్చిమ డెల్టాకు 1316 క్యూసెక్కులు
తాడేపల్లి రూరల్(దుగ్గిరాల): కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద శుక్రవారం 1316 క్యూసెక్కులు విడుదల చేశారు. హై లెవల్ కాలువకు 106 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్‌కు 60 క్యూసెక్కులు, తూర్పు కెనాల్‌కు 286, పశ్చిమ కెనాల్‌కు 45 క్యూసెక్కులు, , కొమ్మమూరు కాల్వకు 800 క్యూసెక్కులు విడుదల చేశారు.
92.53 శాతం
పింఛన్ల పంపిణీ
నెహ్రూనగర్: వైఎస్సార్ పెన్షన్ కానుక శుక్రవారం జిల్లాలో లబ్ధిదారులకు వలంటీర్లు ఇంటికి వెళ్లి పింఛన్ అందజేశారు. గుంటూరు జిల్లాలో శుక్రవారం 92.53 శాతం పంపిణీ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా ఈ నెలలో 2,52,367 మంది లబ్ధిదారులు ఉండగా వారి కోసం ప్రభుత్వం రూ.69.34 కోట్లు కేటాయించింది. శుక్రవారం సాయంత్రానికి 2,33,521 మంది లబ్ధిదారులకు రూ.64.38 కోట్ల పంపిణీ పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment