మేడికొండూరు: మండలంలోని పేరేచర్లలోని జగనన్న కాలనీలను శనివారం జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి పరిశీలించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద లే అవుట్‌లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న విధానాన్ని ఆయన పరిశీలించారు. వేసవిలో పనులు శరవేగంగా, నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. లేఅవుట్‌లో ఆప్షన్–3 కింద 3588 ఇళ్లు బేస్‌మట్టం లెవల్‌కు వచ్చాయని హౌసింగ్ అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. మేడికొండూరు తహసీల్దార్ కరుణకుమార్, హౌసింగ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శంకరరావు, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శ్రీనివాస్, ఏపీఎంఆర్‌డీసీ డైరెక్టర్ చిన్నప్పరెడ్డి, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.
‘పది’ ఇన్విజిలేటర్ సస్పెన్షన్
రేపల్లె రూరల్: మండలంలోని వడ్డీవారిపాలెంలో జెడ్పీహైస్కూలులో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షల తీరును శనివారం ఆర్జేడీ పార్వతి పరిశీలించారు. కేంద్రంలో స్లిప్‌లు కనిపించటంతో మాస్‌కాపీయింగ్ జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ మునియ్య, డిపార్ట్‌మెంటల్ అధికారి నరేంద్ర, ఇన్విజిలేటర్ వినోద్‌కుమార్‌లను ఆదేశించారు. ఇన్విజిలేటర్ వినోద్‌కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు డీఈఓ రామారావు తెలిపారు.
20న విస్తరణ సలహా మండలి సమావేశం
గుంటూరురూరల్: కృష్ణా మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశాన్ని ఈనెల 20వ తేదీన నిర్వహించనున్నట్లు లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ జి.సుబ్బారావు శనివారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. నగర శివారుల్లోని లాంఫాం నందున్న సమావేశ మందిరంలో కృష్ణా మండలంలోని వివిధ జిల్లాల రైతుల సమస్యలు, వాటి పరిష్కారాలు, రానున్న సంవత్సరంలో పరిశోధన, విస్తరణ కార్యక్రమాల దిశానిర్దేఽశంపై చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, జిల్లా అధికారులు, ఆదర్శరైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొంటారన్నారు. ఆసక్తిగల రైతులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.
డీఎస్‌ఓగా మోహన్‌బాబు
గుంటూరువెస్ట్: జిల్లా పౌర సరఫరాల శాఖాధికారిగా జి.మోహన్‌బాబును నియమిస్తూ ఆ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు మోహన్‌బాబు పల్నాడు జిల్లాలో పనిచేశారు. గుంటూరులో డీఎస్‌ఓగా పనిచేస్తున్న ఎస్.పద్మశ్రీని పల్నాడు జిల్లాకు బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment