పేరు : కె.లక్ష్మీసూర్య,
కేటగిరి : ఓబీసీ
మా స్వస్థలం అనకాపల్లి జిల్లా కేజేపురం. నాన్న చిన్నప్పలనాయుడు వ్యవసాయం చేస్తున్నారు. 7వ తరగతి నుంచి గుంటూరులోనే హాస్టల్‌లో ఉండి ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ పొందాను. జేఈఈ మెయిన్స్‌లో 94వ ర్యాంకు, అడ్వాన్స్‌డ్ ఓపెన్ కేటగిరీలో 53వ ర్యాంకు సాధించాను. రోజుకు 13 గంటలు చదివాను. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ బోధన. వీక్లీ టెస్టులు మెరుగైన ర్యాంకు సాధనకు దోహదం చేశాయి. ముంబై ఐఐటీలో సీఎస్‌ఈలో చేరతాను.
నాన్న కష్టానికి దక్కిన ఫలం
పేరు : పి.నిశ్చల్ సుభాష్
కేటగిరి : ఈడబ్ల్యూఎస్
ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న నాన్న రవి నన్ను చదివించేందుకు ఎంతో కష్టపడుతున్నారు. ఆయన కష్టానికి ప్రతిఫలం ఇది. మా సొంతూరు తణుకు. చిన్నప్పటి నుంచి గుంటూరులోనే చదువుతున్నా. ఐఐటీలో చదవాలనే లక్ష్యంతో కళాశాలలో తరగతులను సద్వినియోగం చేసుకుని, ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా మెరుగైన ర్యాంకు పొందాను. ఓపెన్ కేటగిరీలో 153వ ర్యాంకు సాధించాను. ముంబై ఐఐటీలో సీఎస్‌ఈలో చేరతాను.
Comments
Please login to add a commentAdd a comment