గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి
యడ్లపాడు: కొండవీడు కోటను గుంటూరు కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. పురాతన కట్టడాలు, అభివృద్ధి పనులను తిలకించారు. అద్దంకి రెడ్డిరాజులు నిర్మించిన వెదుళ్లు, ముత్యాలమ్మ, పుట్టాలమ్మ చెరువులతోపాటు వ్యూ పాయింట్లను సందర్శించి సెల్ఫీలు దిగారు. కొండవీడు ప్రాశస్త్యాన్ని కొండవీటి కోట అభివృద్ధి కన్వీనర్ కల్లి శివారెడ్డి కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ కొండవీడును సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం రెడ్డిరాజుల వారసత్వ ప్రదర్శన శాలను కలెక్టర్ సందర్శించారు.
బస్సులపై కేసు
పట్నంబజారు(గుంటూరు వెస్ట్): నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై రవాణాశాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. గుంటూరు, తెనాలి, టోల్‌ప్లాజాతోపాటు పలు ప్రాంతాల్లో ఆదివారం తనిఖీలు నిర్వహించిన అధికారులు 14 బస్సులపై కేసులు నమోదు చేశారు. సరైన పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న 2 బస్సులపైనా కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. డీటీసీ షేక్ కరీం మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైకి వచ్చే వాహనానాలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
28 నుంచి పల్నాడు రైల్వేస్టేషన్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్ట్
నరసరావుపేట: పల్నాడు జిల్లాలోని నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి స్టేషన్లలో పలు రైళ్ల హాల్ట్‌ని పునరుద్ధరిస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీచేసిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదివారం వెల్లడించారు. రైల్వేమంత్రి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రైళ్లు ఆయా స్టేషన్లలో ఆపకపోవటం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గతంలో అనేక మార్లు రైల్వే మంత్రి, అధికారులకు విన్నవించినట్టు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. ఈ అభ్యర్థనల ఫలితంగా రైల్వేశాఖ పలు రైళ్ల హాల్ట్‌ను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం హర్షణీయమని పేర్కొన్నారు. సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి స్టేషన్లలో తిరుపతి –లింగంపల్లి నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ (12733), భువనేశ్వర్–సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్ (17015), ఏంజీఆర్ చైన్నె సెంట్రల్–హైదరాబాద్ చైన్నె ఎక్స్‌ప్రెస్(12603) రైళ్లకు ఈనెల 28 నుంచి, నాగర్సోల్–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ (17232)కు జూలై ఒకటి నుంచి హాల్ట్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 519.90 అడుగుల వద్ద ఉంది. ఇది 149.0933 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 808.60 అడుగుల వద్ద ఉంది. ఇది 33.5302 టీఎంసీలకు సమానం.
దుర్గమ్మ సన్నిధిలో మహిళా ఐఏఎస్‌లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ఆదివారం పలువురు మహిళా ఐఏఎస్‌లు దర్శించుకున్నారు. భీమవరం జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఐఏఎస్ కె.హైమావతి అమ్మవారి దర్శనానికి విచ్చేయగా, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించగా, ఈవో భ్రమరాంబ వారికి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. పాలక మండలి సభ్యులు కట్టా సత్తెయ్య, బచ్చు మాధవీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment