గుంటూరు లీగల్: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, వలంటీర్లుపై విషం చిమ్ముతే సహించేది లేదని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు, గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి హెచ్చరించారు. వారాహి విజయయాత్రలో భాగంగా ఏలూరు బహిరంగ సభలో పవన్‌కల్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించి చేసిన ఆరోపణపై పోలూరి స్పందించారు. సోమవారం వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్లకు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు అండగా నిలుస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment