మంగళగిరి: మధ్యప్రదేశ్‌లోని జ్యోతిర్లింగ క్షేత్రం ఓంకారేశ్వరి నందు జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య 108 అడుగుల విగ్రహం ఈనెల 21వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నట్లు తాడేపల్లి శ్రీ సత్యజ్ఞాన ఆశ్రమ అధిపతి పరమపూజ్య ప్రణవానంద భారతిస్వామి తెలిపారు. నగరంలో వేంచేసియున్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారిని మంగళవారం ప్రణవానంద భారతి స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య సనాతన ధర్మాన్ని ఆనాడే దేశ ప్రజల హృదయాల్లో నింపి పురాణాల గురించి ప్రపంచానికి తెలియజేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కల్యాణానంద స్వామి, శ్రీ రవి వదర్ స్వామి కేదారనాథ్, శివానంద దత్త పాల్గొన్నారు.
నేడు పీవీపాలెంలో
జగనన్నకు చెబుదాం
బాపట్ల: జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం పిట్టలవానిపాలెం టీటీడీ కల్యాణ మండపంలో బుధవారం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కలెక్టర్ పి.రంజిత్ బాషా ముఖ్య అతిథిగా హాజరై వినతులు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కారమార్గం చూపుతారని వివరించారు.
జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే పరిశీలన
గుంటూరు మెడికల్ : డాక్టర్ వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్టు సీఈఓ ఎం.ఎన్.హరేంద్రప్రసాద్ మంగళవారం మందడం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కురగల్లు గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే చేస్తున్న సిబ్బంది రమాదేవి, వలంటీర్లతో మాట్లాడి ఏవిధంగా సర్వే చేస్తున్నారు, ఏయే పరీక్షలు చేస్తున్నారు, సిటిజన్ మొబైల్‌లో ఆరోగ్య శ్రీ యాప్ డౌన్‌లోడ్ చేశారా లేదా, ఆరోగ్య శ్రీ బ్రోచర్లు ప్రజలకు అందాయా లేదా అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. సీఈఓ వెంట గుంటూరు ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ నాగళ్ల జయరామకృష్ణ పాల్గొన్నారు.
25న మాచర్లలో స్పందన
నరసరావుపేట: ఈనెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు మాచర్లలో జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దుర్గి, కారంపూడి, రెంటచింతల, మాచర్ల, వెల్దుర్తి మండలాలకు చెందిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద మంగళవారం 3,612 క్యూసెక్కులు విడుదల చేశారు. హై లెవల్ కాలువకు 156, బ్యాంక్ కెనాల్‌కు 916, తూర్పు కెనాల్‌కు 399, పశ్చిమ కెనాల్‌కు 141, నిజాంపట్నం కాలువకు 284, కొమ్మమూరు కాల్వకు 885 క్యూసెక్కులు విడుదల చేశారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 524.90 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 3,773, ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయ నీటిమట్టం 854.70 అడుగుల వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment