జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా
గుంటూరు ఎడ్యుకేషన్: దేశ సమైక్యత, సమగ్రతకు కృషి చేసిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిప్రదాత అని జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా పేర్కొన్నారు. మంగళవారం సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంత్యుత్సవం సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి హెనీ క్రిస్టినా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సంస్థానాల విలీనం ద్వారా దేశంలో ఐక్యతను పరిరక్షించిన వ్యక్తి పటేల్ అని కొనియాడారు. భారత జాతీయ ఉద్యమానికి ఆకర్షితుడైన పటేల్ బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా మహాత్ముని నేతృత్వంలో స్వాతంత్య్ర ఉద్యమంలో పాలు పంచుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్రారెడ్డి, ఏవోలు, ఉద్యోగులు పాల్గొని ఏక్‌తా దివస్ ప్రతిజ్ఞ చేశారు.
రేపటి నుంచి బాలల క్రికెట్ జట్ల ఎంపికలు
నరసరావుపేట డీఎస్‌ఏ స్టేడియంలో నిర్వహణ
నరసరావుపేట: ఉమ్మడి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈనెల రెండో తేదీ నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–17 బాలబాలికల క్రికెట్ జిల్లా జట్ల ఎంపికలు సత్తెనపల్లి రోడ్డులోని డీఎస్‌ఏ స్టేడియంలో జరుగుతాయని పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి సీహెచ్.కోటేశ్వరరావు మంగళవారం వెల్లడించారు. ఆసక్తి కలిగిన బాలలు తప్పనిసరిగా తమ పాఠశాలల్లో రిజిస్టర్ చేయించుకుని ఉదయం 9 గంటల తర్వాత డీఎస్‌ఏ స్టేడియంలో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. 2007 జనవరి ఒకటో తేదీ లేదా తర్వాత జన్మించిన వారై ఉండాలని సూచించారు. సీబీఎస్‌ఈ సిలబస్ లేదా కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న వారు తమ పాఠశాల నుంచి ఎస్‌జీఎఫ్ గేమ్స్‌లో మాత్రమే పాల్గొంటామని, ఎస్‌జీఎఫ్ వారు జారీ చేసిన డిక్లరేషన్ ఫామ్‌ను పూర్తిచేసి తీసుకుని రావాలని కోటేశ్వరరావు సూచించారు.
యార్డుకు 38,156
బస్తాల మిర్చి రాక
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 38,156 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 35,429 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.10,000 నుంచి రూ.23,300 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.10,000 నుంచి రూ.26,000 వరకు లభించింది. ఏసీ కామన్ రకం క్వింటాలుకు రూ.11,500 నుంచి రూ.23,500 వరకు పలికింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.12,000 నుంచి రూ.25,500 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.6,000 నుంచి రూ.14,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 12,497 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 525 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 26,754 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకి 1,350 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయ నీటిమట్టం 844.20 అడుగుల వద్ద ఉంది.
నిమ్మకాయల ధరలు
తెనాలిటౌన్: తెనాలి మార్కెట్‌లో మంగళవారం క్వింటాలు నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ 3,200, గరిష్ట ధర రూ 4,600, మోడల్ ధర రూ 4,000 వరకు పలికింది.
Comments
Please login to add a commentAdd a comment