ఇప్పటి వరకు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయి రాష్ట్రంలోని ప్రధాన రాజకీయపార్టీలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలు అంటే బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ అని నిరూపించారు. బీసీలకు పలు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి అధికారం కట్టబెట్టారు. జనరల్ స్థానాలను సైతం బీసీలకు కేటాయించారు. తాజాగా జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీసీలకు అత్యధిక స్థానాలను కేటాయించి వారిపట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
గెలుపునకు సమష్టిగా కృషి చేస్తాం
నరసరావుపేట ఎంపీ సీటు బీసీలకు కేటాయించడం చాలా సంతోషం. నరసరావుపేట ఎంపీ అభ్యర్థితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా కృషి చేస్తాం.
– రాజవరపు శివనాగేశ్వరరావు, న్యాయవాది, శాలివాహన సంఘనేత, సత్తెనపల్లి
రాజ్యాధికారం దిశగా బీసీలు
బీసీలకు రాజ్యాధికారం అందించే దిశగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. రాష్ట్రంలోని బీసీలంతా ిసీఎంకు రుణపడి ఉంటారు. అన్నింటా బీసీలకు పెద్దపీట వేస్తున్నారు.
– ఎద్దులదొడ్డి కోటేశ్వరమ్మ, వాల్మీకి,
బోయ కార్పొరేషన్ డైరెక్టర్, సత్తెనపల్లి
సాక్షి, నరసరావుపేట/సత్తెనపల్లి: నరసరావుపేట లోక్‌సభ చరిత్రలో ఇప్పటి వరకు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎంపీగా ఎన్నికవ్వలేదు. సుమారు నలభై దాకా బీసీ ఉప కులాలు ఉన్న పల్నాడు ప్రాంతంలో ఎప్పుడూ అగ్ర వర్ణాలకు చెందిన వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఒరవడిని మార్చి బీసీలకు ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్‌లో స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నరసరావుపేట పార్లమెంట్‌కు మాజీ మంత్రి పి అనిల్‌కుమార్ యాదవ్‌ను సమన్వయకర్తగా నియమించడంతో బీసీ సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో బీసీలంతా సమష్టిగా సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గెలుపు కోసం పని చేస్తామని చెబుతున్నారు.
చరిత్రలో తొలిసారిగా....
1952 నుంచి 2019 వరకు 15సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పటికీ ఏ రాజకీయపార్టీ కూడా బీసీలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. ఇక్కడ నుంచి సి.రామయ్యచౌదరి, మద్ది సుదర్శనం, కాసు బ్రహ్మానందరెడ్డి, కాటూరి నారాయణస్వామి, కోట సైదయ్య, కాసు వెంకటకృష్ణారెడ్డి, కొణిజేటి రోశయ్య, నేదురుమల్లి జనార్దనరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, రాయపాటి సాంబశివరావు లాంటి ఉద్దండులు ప్రాతినిధ్యం వహించారు. అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని తొలిసారిగా బీసీలకు కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందని బీసీ సంఘాల నాయకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ నుంచి అనిల్‌కుమార్ యాదవ్‌ను గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా అందిస్తామని సంబరాలు నిర్వహించారు. ఇటీవల నరసరావుపేటలో కార్యాలయం ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చి మద్దతు పలికారు.
వైఎస్సార్ సీపీలో బీసీలకు పెద్దపీట
నరసరావుపేట ఎంపీ టికెట్ బీసీ వర్గాలకే సమన్వయకర్తగా ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన పి అనిల్‌కుమార్ యాదవ్ పల్నాడు జిల్లాలో బీసీ సంఘాల ఆనందోత్సాహాలు అత్యధిక మెజార్టీతో గెలిపించి కానుకగా ఇస్తామంటూ ప్రతిన
వడ్డెర సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ
రాష్ట్రంలో ఎన్నడూ వడ్డెర సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన దాఖలాలు లేవు, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నంను శాసనమండలికి పంపారు. పల్నాడుకు చెందిన మరో బీసీ నేత జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ ఇవ్వడంతోపాటు ప్రభుత్వ విప్‌గా సముచిత స్థానం కల్పించారు. గుంటూరు మార్కెట్ యార్డుకు చైర్మన్‌గా యాదవ సామాజిక వర్గానికి చెందిన నిమ్మకాయల రాజానారాయణకు అవకాశం కల్పించారు. స్థానిక సంస్థలు, పలు కార్పొరేషన్ల డైరెక్టర్ పదవులను బీసీలకు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment