గుంటూరు వెస్ట్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఒక పార్లమెంట్, ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అవసరమైన స్టేషనరీ సరఫరా కోసం సీల్డ్ కవర్ టెండర్‌లు వేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. వివరాలకు 98499 04005 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.
వేజండ్ల కాయర్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం
వేజండ్ల(చేబ్రోలు): మండలంలోని వేజండ్ల గ్రామంలోని కాయర్ అండ్ కాయర్ రోప్ ఇండస్ట్రీలో మంగళవారం విద్యుదాఘాతమై భారీ ఆస్తి నష్టం జరిగింది. గత ఏడాది కాయర్ అండ్ కాయర్ రోప్ ఇండస్ట్రీను వంగా నవ్య నిర్మించారు. అయితే మంగళవారం తెల్లవారుజాము న విద్యుదాఘాతంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి పరిశ్రమలోని యంత్ర సామగ్రి, మెటీరియల్ కాలిబూడిదయ్యాయి. ఎగుమతికి సిద్ధంగా ఉన్న మూడు లారీల కొబ్బరితాళ్లు, నాలుగు లారీల కొబ్బరిపీచు, ఇతర సామగ్రి దగ్థమయ్యాయి. విలువైన యంత్ర పరికరాలు కాలిపోయాయి. గుంటూరు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. జరిగిన ఘటనపై యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విధి నిర్వహణలో
అలసత్వం వద్దు
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్
సూపరింటెండెంట్ నాగేశ్వరరావు
గురజాల: విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి.నాగేశ్వరరావు హెచ్చరించారు. స్థానిక పంచాయతీరాజ్ బంగ్లాలో గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఏపీఎస్‌బీసీఎల్ నందు పనిచేస్తున్న సూపర్ వైజర్లు, సేల్స్‌మెన్‌లకు అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. మద్యం దుకాణాల నిర్వహణతో పాటు రికార్డుల నిర్వహణపై అవగాహన కల్పించారు. మద్యం దుకాణంలో మద్యాన్ని నిర్దేశించిన ధరలకు మాత్రమే విక్రయించాలన్నారు. ప్రదానంగా సమయ పాలన పాటించాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించరాదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ బుజ్జిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment