గుంటూరు మెడికల్ : గుంటూరు జీజీహెచ్‌లో రూ.10 కోట్లతో రెండంతస్తుల భవన నిర్మాణం చేపట్టేందుకు గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ పొదిల ప్రసాద్ ముందుకు వచ్చారు. గతంలో రూ. 5 కోట్లతో డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్‌స్పెషాలిటీ మిలీనియం బ్లాక్ నిర్మాణం చేపట్టిన ప్రసాద్ మరోసారి పెద్ద మనస్సుతో రూ.10 కోట్లతో రెండంతస్తుల భవన నిర్మాణానికి రంగం సిద్ధం చేశారు. ఈమేరకు శుక్రవారం గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణను కలిసి నిర్మాణ పనులకు పూజ చేశారు. డాక్టర్ పొదిల ప్రసాద్ మాట్లాడుతూ జీజీహెచ్‌కు వచ్చే పేద రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తాము భవన నిర్మాణం చేపడుతున్నామన్నారు. గతంలో తాము నిర్మించిన పొదిల ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ భవనంపైనే అదనంగా మరో రెండంతస్తులు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే వైద్య విభాగాలన్ని ఒకేచోట అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో భవన నిర్మాణం చేపడుతున్నామన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ మాట్లాడుతూ పెద్ద మనస్సుతో ఆసుపత్రిలో రూ.10 కోట్లతో భవన నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వచ్చిన డాక్టర్ పొదిల ప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ పొదిల ప్రసాద్‌ను ఆదర్శంగా తీసుకుని మరికొంత మంది దాతలు ఆసుపత్రి అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. కార్యక్రమంలో జింకానా కో ఆర్డినేటర్‌లు డాక్టర్ వెనిగండ్ల బాలభాస్కరరావు, డాక్టర్ హనుమంతరావు, అడ్మినిస్ట్రేటర్ బి.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
డాక్టర్ పొదిల ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment