గుంటూరు
బుధవారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2025
I
ఆలయానికి రూ.లక్ష విరాళం
పిడుగురాళ్ల: పట్టణంలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయం అభివృద్ధికి కందుల శ్రీనివాసరావు, మాధవి దంపతులు రూ.లక్ష సోమవారం అందజేశారు.
న్యాయశాఖ క్యాలెండర్ ఆవిష్కరణ
నగరంపాలెం: జిల్లా కోర్టు ఆవరణలోని డీజే హాల్‌లో న్యాయశాఖ నూతన క్యాలెండర్‌ను మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ.పార్థసారథి ఆవిష్కరించారు.
ఐ లవ్ సత్తెనపల్లి
సత్తెనపల్లి: పట్టణంలోని తాలూకా సెంటర్‌లో విద్యుత్ దీపాలతో ఐ లవ్ సత్తెనపల్లి అంటూ పురపాలక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి అలంకరించారు.
2024కు వీడ్కోలు పలుకుతూ 2025కు స్వాగతం పలుకుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. గుంటూరు నగరంలోని పలు ఆలయాలు, ప్రార్థన మందిరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రార్థనాలయాలలో ప్రార్థనలు చేశారు. పలు స్వీట్ షాపులు కిటకిటలాడాయి. అర్ధరాత్రి 12 గంటల తర్వాత యువత వీధులలోకి వచ్చి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేరింతలు కొట్టారు. స్వీట్లు పంచుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment