మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారు షరీఫ్
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారులు అహ్మద్ షరిఫ్ చెప్పారు. స్ధానిక పొన్నూరు రోడ్డులోని, సంగడిగుంటలోని మైనారిటీ బాలిక గురుకుల పాఠశాలను సోమవారం ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారుడు ఎం.ఎ షరీఫ్, తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి షరీఫ్ సందర్శించారు. ముందుగా మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులతో మాట్లాడారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 ఉర్దూ బాలురు, బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయన్నారు. వాటికి సొంత భవనాలు, ఆట స్ధలాలను సమకూర్చాలని కృషి చేస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో మైనార్టీ ఐటీఐ, పాలిటెక్నిక్, రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ మైనారిటీల విద్యకు సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment