లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
హన్మకొండ అర్బన్: గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్య నేరమని జిల్లాలో ఎవరైనా అలా పరీక్షలు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా అప్రాప్రియేట్ అఽథారిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే నమోదైన కేసులు పరిష్కారం వేగవంతం చేయాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. స్కానింగ్ సెంటర్లపై నిఘా, ఆకస్మిక దాడులు చేసి చట్ట వ్యతిరేక చర్యలు ఆపాలని సూచించారు. అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నంబర్ 181కు కాల్ చేయాలని నంబర్‌కు ప్రచారం కల్పించాలని సూచించారు. ఆబార్షన్లకు సంబంధించి సమాచారం రహస్యంగా ఇచ్చేందుకు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేయాలని, ఒక మెయిల్ ఐడీ అందుబాటులోకి తేవాలని కలెక్టర్ సూచించారు. సమాచారం ఇచ్చిన వారి పేరు ఇతర వివరాలు రహస్యంగా ఉంచుతామని నమ్మకం కల్పించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్సులు తాత్కాలికంగా రద్దు చేయాలన్నారు. డీఓంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య, డీడబ్ల్యూఓ జయంతి, బన్ను సొసైటీ ప్రతినిధి ఈవీ శ్రీనివాస్‌రావు, ఇతర అధికారులు ఉన్నారు.
ఓటు చైతన్యం కోసం ముగ్గుల పోటీలు
ఓటు హక్కు వినియోగించుకోవాలని స్వీప్ ఆధ్వర్యంలో చేపట్టిన చైతన్య కార్యక్రమాల్లో భాగంగా గురువారం హనుమకొండ కలెక్టరేట్‌లో గురుకుల పాఠశాల విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. ఈసందర్భంగా ఉత్తమ ముగ్గులను ఎంపిక చేసి విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. జెడ్పీ సీఈఓ విద్యాలత, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, డీటీలు విఠలేశ్వర్, శ్యాంకుమార్, ఇతర అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.
వృద్ధుల కేసులు సత్వరమే పరిష్కరించాలి
వయో వృద్ధులకు సంబంధించి కేసులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు గురువారం కలెక్టరేట్‌లో వయో వృద్ధుల సంరక్షణ, పోషణ్ చట్టం పరిధిలో వచ్చిన కేసుల పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేశారు. ఆసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అదేవిదంగా ట్రిబ్యూనల్‌లో నమోదైన కేసులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కుటుంబ సభ్యులకు, వృద్ధులకు కౌన్సెలింగ్ నిర్వహించి సానుకూల పరిష్కారం చూపాలని సూచించారు. హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, పరకాల ఆర్డీఓ డాక్టర్ కన్నం నారాయణ, డీడబ్ల్యూఓ జయంతి ఇతర అధికారులు ఉన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య
Comments
Please login to add a commentAdd a comment