హసన్‌పర్తి: ఇటీవల హత్యకు గురైన బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగికి ఇద్దరు కూతుళ్లు. కుమారుడు లేడు. అమెరికాలో ఉంటున్న పెద్ద కూతురు వచ్చి తన తండ్రికి తలకొరివి పెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని 58వ డివిజన్ శ్రీనగర్‌కాలనీకి చెందిన రాజమోహన్(60) ఈనెల 3వ తేదీన హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయనకు ఇద్దరూ కూతుళ్లే. పెద్ద కూతురు శిరీష అమెరికాలో ఉంటుండగా, చిన్న కూతురు స్ఫూర్తి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.
రాజమోహన్ భార్య కరోనా సమయంలో చనిపోయింది. దీంతో అతను ఒంటరిగా శ్రీనగర్‌కాలనీలో ఉంటున్నాడు. తండ్రి హత్య వార్త తెలిసిన వెంటనే పెద్ద కూతురు శిరీష అమెరికా నుంచి వచ్చింది. ఆమె వచ్చేదాకా ఆయన మృతదేహాన్ని ఫ్రీజర్‌లో భద్రపరిచారు. శుక్రవారం నగరానికి చేరుకున్న ఆమె తండ్రి అంత్యక్రియలు జరిపించింది. కుండ పట్టి కాటి వరకు నడిచింది. సంప్రదాయబద్ధంగా తండ్రికి తలకొరివి పెట్టింది. ఇదిలా ఉండగా, రాజమోహన్‌ను హత్యచేసిన నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. నిందితుడు నగరంలోని రెవెన్యూ కాలనీకి చెందిన వ్యక్తిగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment