వినతులు త్వరితగతిన పరిష్కరించండి
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన వినతుల్ని త్వరితగతిన పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ నేరుగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 140 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వైవీ గణేశ్, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, డీఆర్డీఓ మేన శ్రీను, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
చర్యలు తీసుకోవాలి...
నగరంలోని స్నేహనగర్ కాలనీలో పర్యావరణ సమస్యలు అధికమవుతున్న నేపథ్యంలో అధికారులు శ్రద్ధ తీసుకోవాలని, మౌలిక వసతులు కల్పించాలని స్నేహనగర్ కాలనీ డెవలప్‌మెంట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు.
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
ప్రజల నుంచి అర్జీల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment