‘బైపాస్’ రోడ్డు భయం.. రైతు హఠాన్మరణం
వరంగల్: వరంగల్ నగరం పరిధిలో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా) ప్రతిపాదించిన ఇంటర్నల్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) బైపాస్ రోడ్డు కింద వ్యవసాయ భూమి పోతుందనే భయంతో రైతు దయ్యాల రాజబీరయ్య (65) గుండెపోటుతో మృతిచెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా ఆరెపల్లి గ్రామానికి చెందిన రైతు దయ్యాల రాజబీరయ్యకు 1.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇంటర్నల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో ఈ భూమి పోతుందని తెలియడంతో వారం రోజులుగా మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటుతో మృతిచెందాడు. పైడిపల్లి, ఆరెపల్లి మీదుగా కొత్తపేట క్రాస్ రోడ్డు వరకు 200 ఫీట్ల ఐఆర్‌ఆర్ బైపాస్ రోడ్డు కోసం ‘కుడా’ అధికారులు రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా పలుమార్లు సర్వే నిర్వహించారని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి పేద ప్రజల కు మేలు జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment