4న జిల్లా స్థాయి ప్రతిభాపాటవ పరీక్ష
విద్యారణ్యపురి: ఈనెల 4న పదో తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయి సాంఘికశాస్త్ర ప్రతిభాపాటవ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ వాసంతి బుధవారం తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల్లోని అన్ని పాఠశాలల పదో తరగతి విద్యార్థులు పాల్గొనవచ్చని సూచించారు. పాఠశాల స్థాయిలో ఈనెల 2న టాలెంట్ టెస్ట్ నిర్వహించి అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారిని జిల్లా స్థాయి పోటీలకు తీసుకురావాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారిని ఈనెల 21న రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు అలిగిరెడ్డి మధుసూదన్‌రెడ్డి 98498 34110, వడ్డేపల్లి సతీశ్‌ప్రకాశ్ 94401 46460 నంబర్లలో సంప్రదించాలని జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్ తెలిపారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల
డిమాండ్లు నెరవేర్చాలి
విద్యారణ్యపురి: సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నబోయిన తిరుపతి డిమాండ్ చేశారు. బుధవారం దీక్షకు సంఘీభావం తెలిపిన ఆయన మాట్లాడుతూ.. 27 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం స్పంది ంచకపోవడం శోఛనీయమన్నారు. వీరి న్యాయమైన డిమాండ్లకు టీపీటీఎఫ్ మద్దతుగా ఉంటుందన్నారు. సంఘీభావం తెలిపిన వారిలో హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రగిరి లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. దీక్షలో హనుమకొండ, వరంగల్ జిల్లాల సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎండీ షఫీ, దొనికన శ్రీధర్‌గౌడ్, అసోసియేషన్ బాధ్యులు మొగిలిచర్ల శ్రీనివాస్, జ్యోతి, పబ్బురాజు, ఆనందం, కుమార్, సంపత్, రాజ్‌కుమార్, మహేందర్, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.
అంతర్జాతీయ హ్యాండ్‌బాల్
కోచ్‌గా విష్ణువర్ధన్
వరంగల్ స్పోర్ట్స్: ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు లక్నోలో జరగనున్న అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొనే ఇండియా పురుషుల జట్టు కోచ్‌గా ఖిలావరంగల్‌కు చెందిన బొడ్డు విష్ణువర్ధన్ నియమితులయ్యారు. ఈమేరకు హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఇండియా జనరల్ సెక్రటరీ డాక్టర్ తేజరాజ్‌సింగ్ బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. తన నియామకానికి సహకరించిన అసోసియేషన్ ఈడీ డాక్టర్ ఆనంద్ ఈశ్వర్‌పాండే, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ తెలంగాణ చైర్మన్, హెచ్‌సీఏ అధ్యక్షుడు ఎ.జగన్మోహన్‌రావు, సాట్ వీసీఅండ్‌ఎండీ సోనీ బాలాదేవి, సాట్ డీడీ జి.రవీందర్, హనుమకొండ డీవైఎస్‌ఓ అశోక్‌కుమార్‌కు విష్ణువర్ధన్ ధన్యవాదాలు తెలిపారు. ఇండియా టీం కోచ్‌గా ఎంపికైన విష్ణువర్ధన్ ఒలింపిక్స్ సంఘం బాధ్యులు, కోచ్‌లు, క్రీడా సంఘాల బాధ్యులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment