తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
కాజీపేట అర్బన్: ప్రభుత్వానికి మూడో ఆదాయ వనరు అయిన రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం తగ్గింది. 2023లో రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉన్నా రూ.358 కోట్ల ఆదాయం సమకూరింది. కానీ, 2024లో దస్తావేజుల సంఖ్య పెరిగినా కూడా ఖజానాకు రూ.320 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది.
రియల్ ఎస్టేట్‌పై 257 మెమో ప్రభావం..
రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖను ప్రక్షాళన చేసేందుకు గత ప్రభుత్వం 257 మెమో తీసుకొచ్చింది. దీని ద్వారా అనుమతిలేని భూముల దస్తావేజులకు రిజిస్ట్రేషన్లు చేయకూడదనే నిబంధన నేటికీ కొనసాగుతుండడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోయింది. దీని ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై పడిపోయింది. భూములను కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్లు కా లేదు. కొనేవారు ముందుకు రాక అమ్మేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. లేఅవుట్, అనుమతి ఉన్న భూముల దస్తావేజులు మాత్రమే రిజిస్ట్రేషన్లు కావడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల జోరు తగ్గింది.
సేల్ డీడ్‌లతోనే ఖజానాకు ఆదాయం..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనుమతులు లేని దస్తావేజులకు రిజిస్ట్రేషన్లు కావడం లేదు. ఇంటి నంబర్, లే అవుట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. దీంతో ఏడాది కాలంలో మార్టిగేజ్ దస్తావేజులు పెరిగిపోయాయి. సాధారణంగా సేల్ డీడ్‌లతో ఖజానాకు ఆదాయం ఎక్కువగా సమకూరుతుంది. మార్టిగేజ్ వంటి దస్తావేజులతో దస్తావేజుల సంఖ్య పెరిగినా ఆదాయం మాత్రం తగ్గిపోయింది.
ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు
రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇటీవల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్లపై సైతం నూతన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. కాగా, సంక్రాంతి రోజున దస్తావేజుల రిజిస్ట్రేషన్లపై కీలక నిర్ణయాలను తీసుకుని ప్రకటన చేసే అవకాశం ఉందని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చర్చించుకుంటున్నారు.
గత సర్కారు తీసుకొచ్చిన
257 మెమోనే కారణం
2023లో రూ.358 కోట్లు..
2024లో రూ.320 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతికి
తీసుకునే నిర్ణయంపై ఆశలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని
13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 2023, 2024 సంవత్సరాల్లో ఖజానాకు వచ్చిన ఆదాయం వివరాలు..
సంవత్సరం దస్తావేజులు ఆదాయం
(రూపాయల్లో)
2023 1,04,297 358 కోట్లు
2024 1,05,363 320 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment