సాక్షి, సిటీబ్యూరో: ఉత్పత్తి ధరలకే అందిస్తున్న చేనేత వస్త్రాలను ఆదరించి, నేత కార్మికులకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత అన్నారు. శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ, ఆప్కో సంయిక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను శుక్రవారం ఆమె ప్రారంభించారు. నవంబరు 2వ తేదీ వరకు ఈ ప్రదర్శన నిర్వహిస్తుండగా, వినియోగదారులకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రదర్శనలో దాదాపు 40 చేనేత పారిశ్రామిక సహకార సంఘాలు పాల్గొంటున్నాయన్నారు. రాయితీ ధరలకు అందిస్తున్న ప్రత్యేక విక్రయాలను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ అదనపు సంచాలకులు శ్రీకాంత్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత
Comments
Please login to add a commentAdd a comment