సమన్వయంతో వేడుకలు విజయవంతం | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో వేడుకలు విజయవంతం

Published Thu, Sep 26 2024 11:50 AM | Last Updated on Thu, Sep 26 2024 11:50 AM

సమన్వయంతో వేడుకలు విజయవంతం

సాక్షి,సిటీబ్యూరో: నగరంలో బోనాలు, గణేష్‌ ఉత్సవాలు, మిలాద్‌–ఉన్‌–నబి వేడుకలు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయడంతో విజయవంతమై ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బుధవారం హోటల్‌ గోల్కొండలో ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌ – 2024కు ఆయన మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లోనూ అందరూ సమష్టి బాధ్యతతో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ ను కాపాడాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం వైద్య,విద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు నిర్వాసితులకు నష్టం జరగకుండా పునరావాసం, ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆయన బోనాలు, గణేష్‌ ఉత్సవాలు, మిలాద్‌ ఉన్‌ నబి ఉత్సవాల్లో కష్టపడి పని చేసిన అధికారులను శాలువా, మెమొంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి్‌, అడిషనల్‌ సీపీ విక్రమ్‌ సింగ్‌ మాన్‌, ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ విశ్వ ప్రసాద్‌, అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటాచారి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

‘చిత్రపురి’అధ్యక్షుడి బెయిల్‌ రద్దు

మణికొండ: చిత్రపురి హౌసింగ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీలో నెలకొన్న అక్రమాలపై నమోదైన కేసుల్లో అరైస్టె బెయిల్‌పై బయటికి వచ్చిన సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్‌ బెయిల్‌ను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు అతను అక్టోబర్‌ 4లోగా పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోవాలని ఆదేశించింది. అతను బెయిల్‌ నిబంధనలను ఖాతరు చేయకపోవడమేగాక ఎలాంటి అనుమతులు లేకుండా విజయవాడకు వెళ్లారని, పలు మార్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారని, ఈ నేపథ్యంలో అతడి బెయిల్‌ రద్దు చేయాలని చిత్రపురి సాధన సమితి అధ్యక్షుడు కస్తూరి శ్రీనివాస్‌ కోర్టును ఆశ్రయించాడు. దీంతో న్యాయస్థానం అతడి బెయిల్‌ రద్దు చేస్తూ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోవాలని ఆదేశించినట్లు శ్రీనివాస్‌ తెలిపారు. బెయిల్‌ నిబంధనలకు విరుద్ధంగా అతను పలువురు సభ్యులను అతను బెదిరించాడన్నారు. త్వరలోనే చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ రద్దయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement