రెడ్‌హిల్స్‌లో కారు బీభత్సం
నాంపల్లి: రెడ్‌హిల్స్‌లోని నిలోఫర్ కేఫ్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కేఫ్‌లో టీ తాగేందుకు వచ్చిన వారిపైకి దూసుకొచ్చింది. రోడ్డు పక్కన నిలబడ్డ వారిని ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటనలో 12 మంది గాయపడగా..నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందులో ఎనిమిది ద్విచక్రవాహనాలు, ఒక కారు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మితిమీరిన వేగంతో ఢీకొట్టుకుంటూ వెళ్లిన డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. డ్రైవర్ మద్యం మత్తులోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..అత్తాపూర్‌కు చెందిన అహ్మద్ మాలిక్ (32) బుధవారం రాత్రి మద్యం తాగి.. స్నేహితులతో కలిసి అర్ధరాత్రి దాటాక భోజనం చేసేందుకు కారులో నిలోఫర్ కేఫ్‌కు బయలుదేరాడు. అప్పటికే కేఫ్ కిక్కిరిసిపోయి ఉంది. 2 గంటల సమయంలో అతను కారు వేగంగా నడుపుతూ లక్డీకాపూల్ సింగరేణి భవన్ వైపు నుంచి నిలోఫర్ కేఫ్ వైపు దూసుకొచ్చాడు. కారును అదుపుచేయలేకపోవడంతో . రోడ్డు మీద టీ తాగుతున్న వారిని ఢీకొంటూ ముందుకు వెళ్లింది. అంతటితో ఆగకుండా మళ్ళీ ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి వద్ద రివర్స్ తీసుకుని మళ్లీ రోడ్డుపై నిల్చున్న వ్యక్తులపైకి దూసుకువచ్చింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో చాలా మందికి కాళ్లు, చేతులు విరిగాయి. క్షతగాత్రులను హుటాహుటిన గన్‌ఫౌండ్రీలోని ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్‌కు ఎదురుగా ఉండే ఉదయ్ ఓమ్నీ ఆసుపత్రికి తరలించారు. చంచల్‌గూడకు చెందిన మొయినుద్దీన్ పరిస్థితి విషమంగా మారడంతో అతడిని మరో ఆసుపత్రికి మార్చారు. మొయినుద్దీన్‌్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కారు డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నారు. దెబ్బ తిన్న కారును నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
మద్యం మత్తులో డ్రైవింగ్..
జనాల మీదకు దూసుకురావడంతో పలువురికి గాయాలు
ఒకరి పరిస్థితి విషమం
Comments
Please login to add a commentAdd a comment