ఇళ్లు ఇవ్వాలంటూ మూసీ గుడిసె వాసుల వినతి
లక్డీకాపూల్: మూసీ నది సుందరీకరణ సరే..మా సంగతేంటంటూ శివాజీ బ్రిడ్జి, ఆఫ్జల్‌గంజ్ గుడిసెవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళనతో గూడు కోల్పొతున్న ర్యాక్ పిక్కర్స్‌కు న్యాయం చేయాలని కోరుతూ ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందించారు. మంగళవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి, చిన్నారెడ్డి వద్ద మూసీ గుడిసెవాసులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాలకు పైగా మూసీనది ఒడ్డున శివాజి బ్రిడ్జి కింద గుడిసెలు వేసుకొని 150 కుటుంబాలు నివశిస్తున్నాయన్నారు. ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని చెత్త ఏరుకుంటూ జీవిస్తున్నామన్నారు. తమకు గూడు కల్పించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన మాట్ విజ్ఞప్తి చేశారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హర్షం
రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 13.86 కోట్లు మంగళవారం విడుదల చేసింది. దీంతో గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమకు నిధులు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డికి పుష్ప గుచ్చం ఇచ్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్యకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment