మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమివ్వండి
సాక్షి, సిటీబ్యూరో: నగరాన్ని చలి వణికిస్తోంది. రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. తెల్లవారుజామున పొగ మంచు రోడ్లను కమ్మేస్తోంది. రాత్రుళ్లు చలి తీవ్రత మరింత పెరుగుతోంది. శివారులో అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోయింది. నగరంలో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రత 11.9 డిగ్రీలు నమోదైంది. సగటు కంటే 4 నుంచి 5 డిగ్రీల వరకు మైనస్‌లో పడిపోయింది.
● యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి
● జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం చేపట్టిన పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సీఈ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ సీఈ పనసరెడ్డిలతో కలిసి ఇంజినీరింగ్ పనులపై జోన్ల వారీగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో ప్రజా సదుపాయాల దృష్ట్యా చేపట్టిన పనుల్ని నిర్దేశిత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్యాత్మకంగా ఉన్న 141 వాటర్ లాగింగ్ పాయింట్లను తగ్గించేందుకు శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, వచ్చే వర్షాకాలంలోగా సమస్యల్లేకుండా పనులు పూర్తి చేయాలన్నారు. 125 జంక్షన్ల అభివృద్ధి పనులకు సంబంధించి భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ సమస్యల పరిష్కారానికి ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రికల్, అడ్వర్టైజ్మెంట్, యూబీడీ విభాగాల అధికారులతో అంతర్గత కమిటీ వేసినట్లు తెలిపారు. కాన్ఫరెన్స్‌లో జోనల్ ఎస్.ఈలు చిన్నారెడ్డి, రత్నాకర్, మహేష్ రెడ్డి, నిత్యానంద్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment