కొలువుదీరిన పుస్తకం
కవాడిగూడ: హైదరాబాద్ 37 వ జాతీయ పుస్తక ప్రదర్శన గురువారం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ నెల 29 వరకు కొనసాగనున్న పుస్తక ప్రదర్శనలో జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. మొత్తం 350 స్టాళ్లు కొలువుదీరాయి. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన కొనసాగనుంది. మొదటి రోజే పుస్తక ప్రియులతో సందడి నెలకొంది. తెలంగాణ పబ్లిషర్స్. విశాలాంధ్ర, నవోదయ, ఎమెస్కో, మంచి పుస్తకం, మిళింద్ పబ్లిషర్స్, అన్వీక్షికి, నవ తెలంగాణ, జైభారత్, రాయలసీమ ఆధ్యాత్మిక వేదిక, బుద్ధం, మానవహక్కుల వేదిక, వీక్షణం, అరుణతార, విరసం తదితర పుస్తక ప్రచురణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. బుక్‌ఫెయిర్‌లో సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. తెలంగాణ బుక్ స్టాల్ ను గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, టీ– శాట్ సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘భారతీయతకు భాష్యం సీతారాం ఏచూరి’ పుస్తకాన్ని పబ్లికేషన్స్ నిర్వాహకులు కోయ చంద్రమోహన్ వీరికి బహూకరించారు.
హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ప్రారంభం
తొలిరోజే భారీ సంఖ్యలో సందర్శకులు
Comments
Please login to add a commentAdd a comment