23న స్టాండింగ్ కమిటీ సమావేశం
సాక్షి, సిటీబ్యూరో: గత నెల 30న జరిగిన జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2025–26) సంబంధించి ప్రవేశపెట్టిన రూ.8,340 కోట్ల ముసాయిదా బడ్జెట్‌పై సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో దాన్ని సవరించారు. సవరించిన బడ్జెట్‌ను ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న ప్రత్యేక స్టాండింగ్ కమిటీ సమావేశం ముందుంచనున్నారు. గత సమావేశం ముందుంచిన బడ్జెట్‌లో ఆస్తిపన్ను, టౌన్‌ప్లానింగ్, ట్రేడ్‌లైసెన్స్, అడ్వర్టయిజ్‌మెంట్ ఫీజులు, తదితరాలను తక్కువగా చూపారని సభ్యులు మండిపడటంతో వాటిని సవరించడంతో పాటు ఇతరత్రా మార్పుచేర్పులతో బడ్జెట్‌ను సవరించారు. పరిశీలించేందుకు తమకు తగిన సమయమివ్వలేదని సభ్యులు మండిపడటంతో గురువారమే సమాచారం నిమిత్తం సదరు బడ్జెట్ ప్రతులను స్టాండింగ్ కమిటీ సభ్యులకు పంపించారు. అనంతరం అజెండాలో మార్పులున్నట్లు సంబంధిత యంత్రాంగం సమాచారం పంపినట్లు తెలిసింది.
విశ్వసనీయ సమాచారం మేరకు సవరించిన ముసాయిదా బడ్జెట్‌లోని మార్పుల్లో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
అంశాల వారీగా పెంచిన నిధులు .. (రూ.కోట్లలో)
అంశం ముసాయిదా సవరణ
ఆస్తిపన్ను 2005.81 2029.81
టౌన్‌ప్లానింగ్ 1037.41 1201.15
ట్రేడ్ లైసెన్స్ 92.00 112.00
ప్రకటనల ఫీజులు 20.45 60.70
ఇవిలా ఉండగా, ముసాయిదాలోని రెవెన్యూ ఆదాయాన్ని రూ.4,205 కోట్ల నుంచి రూ.4,445 కోట్లకు పెంచుతూ సవరించారు.
Comments
Please login to add a commentAdd a comment