మిల్లెట్ల వినియోగం, ప్రచారం మరింత పెరగాలి
రాయదుర్గం: మిల్లెట్ల వినియోగం, ప్రచారం మరింత పెరగాల్సిన అవసరం ఉందని హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. నాలెడ్జి సిటీలోని ఐకియా ప్రాంగణంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, బైసీ(బీఐఎస్‌వై) గ్రూప్, ఐకియా ఆధ్వర్యంలో మిల్లెట్ల వినియోగం, అవగాహన, గిరిజన సంఘం ప్రతినిధులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మినుములను, ఇతర మిల్లెట్లను తప్పనిసరిగా తినాలని ఆయన సూచించారు. వీటి వినియోగం పెరిగేలా చేయడానికి విస్త్రృత స్థాయిలో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన గిరిజన క్యూరేటర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. కొన్ని వందల ఏళ్ల క్రితం గిరిజనులు మినుములు, జొన్నలు తినేవారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మిల్లెట్ మ్యాన్ రాంబాబు, బైసీ గ్రూప్ వ్యవస్థాపకుడు నవీన్ మేడిశెట్టి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment