ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఇయర్ వేడుకల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డ్రగ్స్, గంజాయిపై నిఘా పెట్టాలని సంబంధిత శాఖ అధికారులకు ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి సూచించారు. గురువారం ఆబ్కారీ భవన్‌లో రంగారెడ్డి, హైదరాబాద్ ఎకై ్సజ్, ఎస్‌టీఎఫ్ బృందాలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి మొదటి వారం వరకు ఆయా అధికారులకు సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అనివార్యమైతే తప్ప ఎవరూ సెలవులు పెట్టొద్దని సూచించారు. ఎన్‌డీపీఎల్ మద్యం రాకుండా చూడాలని, ఈవెంట్ మేనేజర్ల కదలికలపై దృష్టి పెట్టాలని, నానక్‌రాంగూడ, సింగరేణి కాలనీ, ఎల్బీనగర్, కర్మన్‌ఘాట్, గోల్కొండ, పుప్పాల్‌గూడ, మణికొండ, రామకృష్ణ కాలనీలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశంలో జాయింట్ కమిషనర్లు ఖురేషీ, కేఏబీ శాస్త్రి, డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, అడిషనల్ ఎస్పీ భాస్కర్, అసిస్టెంట్ కమిషనర్లు ఆర్.కిషన్, అనిల్‌కుమార్‌రెడ్డి, ప్రణవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment