కోనరావుపేట/తంగళ్లపల్లి: పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించిన ప్రేమికులు క్రిమిసంహారక మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలో విషాదం నింపింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. జిల్లాలోని కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన సామల లక్ష్మీనారాయణ–ఇందిర దంపతులు కొన్నేళ్లుగా సిరిసిల్లలోని టెక్స్‌టైల్‌పార్క్‌లో నివసిస్తున్నారు. వీరికి కూతురు, కుమారుడు శ్రీధర్(20) ఉన్నాడు. శ్రీధర్ ఐటీఐ సెకండియర్ చదువున్నాడు.
వీరి ఇంటి పక్కనే ఒబుళాపూర్‌కు చెందిన చెల్ల రాజు–రేణుక దంపతులు కొంతకాలంగా నివసిస్తున్నారు. వీరి కూతురు సంధ్య(17) ఇంటర్ సెకండియర్ చదువుతుంది. సంధ్య, శ్రీధర్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించిన ఇద్దరు రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకొచ్చారు. ఇదిలా ఉండగా సంధ్య కనిపించడం లేదని మంగళవారం తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో యువతి బంధువులు ఫిర్యాదు చేశారు.
ఈక్రమంలోనే బుధవారం సాయంత్రం మామిడిపల్లి–కనగర్తి గ్రామాల మధ్య మూలవాగులో ఇద్దరు మృతిచెంది ఉన్న విషయాన్ని గొర్లకాపరుల ద్వారా గ్రామస్తులకు తెలిసింది. వారి పక్కన గడ్డిమందు డబ్బా పడి ఉండడంతో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు. వీరి ఫోన్, బ్యాగ్ వేములవాడలోని సాయిరక్ష దాబా సమీపంలో లభించాయి. సిరిసిల్లరూరల్ సీఐ సదన్‌కుమార్, కోనరావుపేట, తంగళ్లపల్లి ఎస్సైలు ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, ఏఎస్సై శ్రీనివా స్‌రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమో దు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment