చెరుకు రైతుకు రవాణా భారం | - | Sakshi
Sakshi News home page

చెరుకు రైతుకు రవాణా భారం

Published Sat, Dec 21 2024 12:17 AM | Last Updated on Sat, Dec 21 2024 12:17 AM

చెరుక

చెరుకు రైతుకు రవాణా భారం

● ముత్యంపేట ఫ్యాక్టరీ తెరుచుకోకపోవడంతో..● కామారెడ్డికి తరలించేందుకు తంటాలు ● టన్నుకు రూ.500 చొప్పున.. ఒక లారీకి రూ.10వేల చార్జి

మల్లాపూర్‌(కోరుట్ల): జిల్లాలోని ఏకై క వ్యవసాయ ఆధారిత నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ తెరుచుకోకపోవడంతో ఈ క్రషింగ్‌ సీజన్‌లోనూ చెరుకు రైతులకు రవాణా కష్టాలు తప్పడం లేదు. కామారెడ్డి జిల్లాలోని గాయత్రీ షుగర్‌ ఫ్యాక్టరీకి క్రషింగ్‌ కోసం చెరుకును తరలిస్తుండడంతో రవాణా చార్జీలు తడిసి మోపెడవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. అధికారంలోకి వస్తే నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద బస చేసి రైతులకు హామీ ఇచ్చారు. మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఏర్పాటు చేసి కమిటీ ఇప్పటికే బోధన్‌, ముత్యంపేట ఫ్యాక్టరీలను సందర్శించి, రైతుల అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీంతో ఫ్యాక్టరీల పునరుద్ధరణకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద బ్యాంక్‌ బకాయిలు రూ.192 కోట్లు ప్రభుత్వం చెల్లించడంతో ప్రధాన అడ్డంకి తొలగినట్లయింది. 2025 డిసెంబర్‌ నాటికి ముత్యంపేట ఫ్యాక్టరీని తెరిపించి నడుపాలని ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది.

రూ.5 కోట్ల భారం

చెరుకును క్రషింగ్‌ కోసం కామారెడ్డి గాయత్రీ షుగర్‌ ఫ్యాక్టరీకి తరలిస్తుండడంతో రైతులపై రవాణా భారం పడుతోంది. టన్నుకు రూ.500 వరకు ఖర్చు అ వుతుంది. ప్రస్తుత సీజన్‌లో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో సుమారు 1 లక్ష టన్నుల చెరుకు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈ లెక్కన రైతులు రూ.5 కోట్ల వరకు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది.

‘ఈ రైతు పేరు క్యాతం రవీందర్‌రెడ్డి. మల్లాపూ ర్‌ మండలం చిట్టాపూర్‌కు చెందిన ఈయన 5 ఎకరాల్లో చెరుకుపంట వేయగా సుమారు 200 టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం కామారెడ్డి సమీపంలోని గాయత్రీ షుగర్స్‌ ఫ్యాక్టరీకి క్రషింగ్‌ కోసం పంపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఒక్కో లారీలో 20 టన్నుల చొప్పున మొత్తం 10 లారీల్లో పంటను తరలించనున్నాడు. ఇందుకుగాను ఒక్క లారీకి రవాణా చార్జీ టన్నుకు రూ.500 చొప్పున రూ.10వేలు చెల్లించాలి. ఈ లెక్కన పది లారీలకు రూ.1లక్ష రవాణా చార్జీలుగా చెల్లించాలి. గతంలో ముత్యంపేట ఫ్యాక్టరీ నడిచేటప్పుడు చెరుకును ఎండ్ల బండ్లపై తరలించడంతో ఒక్క రూపాయి కూడా ఈయనకు ఖర్చయ్యేది కాదు. ఆ ఫ్యాక్టరీని మూసివేయడంతో రూ.లక్ష అదనపు భారం పడుతోంది. ఇది ఒక్క రవీందర్‌రెడ్డి ఆవేదన కాదు.. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలోని వందలాది మంది చెరుకు రైతుల పరిస్థితి’.

ఫ్యాక్టరీ తెరిపించాలి

ముత్యంపేట ఫ్యాక్టరీ పరిధిలో తొమ్మిదేళ్లుగా చెరుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు లక్ష టన్నుల చెరుకును కామారెడ్డికి తరలించేందుకు రూ.5కోట్ల వరకు రవాణా భారమవుతుంది. హామీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫ్యాక్టరీలను తెరిపించాలి.

– మామిడి నారాయణరెడ్డి,

చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు

ప్రభుత్వమే భరించాలి

నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలను మూసివేయడంతోనే పంటను కామారెడ్డికి తరలించాల్సి వస్తుంది. దీంతో రైతులపై చార్జీల భారం పడుతుంది. హామీ మేరకు ముత్యంపేట ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరవాలి. అప్పటి వరకు రవాణా చార్జీలు పూర్తిగా భరించాలి.

– నేరేళ్ల మోహన్‌రెడ్డి, ఫ్యాక్స్‌ చైర్మన్‌, చిట్టాపూర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
చెరుకు రైతుకు రవాణా భారం1
1/4

చెరుకు రైతుకు రవాణా భారం

చెరుకు రైతుకు రవాణా భారం2
2/4

చెరుకు రైతుకు రవాణా భారం

చెరుకు రైతుకు రవాణా భారం3
3/4

చెరుకు రైతుకు రవాణా భారం

చెరుకు రైతుకు రవాణా భారం4
4/4

చెరుకు రైతుకు రవాణా భారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement