మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరుట్ల మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను శుక్రవారం సందర్శించారు. ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాలని విద్యార్థులకు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఫోన్‌లో ఉన్నతాధికారులతో మాట్లాడారు. మాజీ ఎంపీపీ సాయిరెడ్డి, నాయకులు చంద్రశేఖర్‌రావు, రాజేశ్, పురుషోత్తం, కిషోర్, శ్రీనివాస్, గంగాధర్, తేజ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment