కలెక్టర్ ఖాతాలోకి మరుగుదొడ్ల నిధులు
జగిత్యాలరూరల్: జిల్లాలోని గ్రామపంచాయతీల్లో నిధుల లేమితో అత్యవసర పనులు చేపట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ అవేమీ పట్టనట్లుగా స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బీఎం) ద్వారా 2018 నుంచి 2020 వరకు గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు డబ్బులు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు నేరుగా గ్రామపంచాయతీ ఖాతాల్లో జమచేశారు. కానీ కొంత మందికి చెల్లింపులు నిలిచిపోవడంతో పంచాయతీ ఖాతాల్లోని నిధులతో పాటు, వాటికి జమ అయిన వడ్డీని కలెక్టర్ ఖాతాకు మళ్లించాలని ఇటీవల సర్కులర్ జారీ చేయడంతో పంచాయతీ కార్యదర్శులు చెక్కులతో కలెక్టర్ ఖాతాలోకి డబ్బులు మళ్లిస్తున్నారు. కాగా, ఖాతాల్లో ఉన్న డబ్బును వెంటనే మార్పు చేయాలని సర్క్యూలర్‌లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై జిల్లా ఇన్‌చార్జి పంచాయతీ అధికారి రఘువరణ్‌ను సంప్రదించగా.. స్పందించలేదు.
● ఇటీవల సర్క్యూలర్ జారీ
Comments
Please login to add a commentAdd a comment