విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
● కలెక్టర్ సత్యప్రసాద్
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించి, ఆవరణలో జరుగుతున్న పనుల పురోగతి తెలుసుకున్నారు. ఏమైనా గుంతలు ఉంటే పూడ్చివేయాలని, పిచ్చిమొక్కలన్నింటినీ తొలగించాలని పంచాయతీ అధికారులకు సూచించారు. విద్యార్థుల భద్రతపై ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో డీపీవో రఘువరన్, ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రామకృష్ణ, మండల వైద్యాధికారి అంజిత్‌రెడ్డి, ఎంపీవో మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
జగిత్యాల: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, చెక్‌పోస్ట్, సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా టాస్క్‌ఫోర్స్, రెవెన్యూ, పోలీసు, మైనింగ్, ఫారెస్ట్, రవాణా శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మండలాల వారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, ఏ సమయంలో జరుగుతుందో నిఘా పెట్టి అరికట్టాలని ఆదేశించారు. పోలీసు శాఖ సమన్వయంతో వాహనాలను సీజ్ చేయాలన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాలసీ ప్రకారం జిల్లాలో ఇసుక లీగల్‌గానే ట్రాన్స్‌పోర్టు కావాలన్నారు. అదనపు కలెక్టర్ లత మాట్లాడుతూ, పోలీసు శాఖ సమన్వయంతో చెక్‌పోస్టు ఏర్పాటు చేసుకోవాలని, చలాన్ కట్టిన వారికి ఇసుక అనుమతి ఇవ్వాలన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ, డిమాండ్, సప్‌లై పరంగా అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతున్న మండలాలను గుర్తించి నిఘా వ్యవస్థ పటిష్టం చేయాలని ఆదేశించారు. మైనింగ్ అధికారి జైసింగ్, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
డంపింగ్ యార్డ్ పరిశీలన
మేడిపల్లి(వేములవాడ): మండల కేంద్రంలోని నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్‌యార్డులను శుక్రవారం కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. నర్సరీ, వైకుంఠధామంలో పిచ్చి మొక్కలు తొలగించాలని సూచించారు. తహసీల్దార్ వసంత, ఎంపీడీవో పద్మజ, సంబంధిత అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment